రెండో విడతలో 96 గ్రామాల్లో రీసర్వే

ABN , First Publish Date - 2022-01-20T05:00:33+05:30 IST

జిల్లాలో రెండో విడత కింద 96 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే జరుగుతున్నదని ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ దాసు తెలిపారు.

రెండో విడతలో 96 గ్రామాల్లో రీసర్వే
రెవెన్యూ సిబ్బందితో మాట్లాడుతున్న ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ దాసు

2023 చివరికల్లా పూర్తి 

ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ దాసు


మనుబోలు, జనవరి 19: జిల్లాలో రెండో విడత కింద 96 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే జరుగుతున్నదని ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ దాసు తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయంలో బుధవారం ఆయన పీవోఎల్‌ఆర్‌, రీసర్వేపై రెవెన్యూ సిబ్బందితో ఆయన సమీక్ష చేశారు. నిర్ధేశించిన తేదీలోగా పీవోఎల్‌ఆర్‌, రీసర్వే పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో 6 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశామన్నారు. రీసర్వే అయిన గ్రామాల్లో ఇక భూ సమస్యలు ఉండవన్నారు. పలుమార్లు రైతులు తహసీల్దారు కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదన్నారు. ఏ పత్రం కావాలన్నా మీసేవలో వస్తాయన్నారు. పీవోఎల్‌ఆర్‌ ద్వారా రెవెన్యూ రికార్డులు పటిష్టం చేస్తారన్నారు. దీనిద్వారా హద్దులు, సర్వే 1908 రికార్డు ప్రకారం అప్‌డేట్‌ చేస్తారన్నారు. భూ విక్రయాలు జరిగినప్పుడు తేడాలు వస్తే తప్ప ఎలాంటి భూ సమస్యలు రావన్నారు. ఫిబ్రవరి నెలాఖరుకల్లా రెండోవిడత రీసర్వే పూర్తవుతుందని, ఆ తర్వాత రెండు నెలల పాటు రికార్డుల అప్‌డేషన్‌ జరగాల్సి ఉంటుందన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో 2023 చివరికల్లా రీసర్వే కార్యక్రమం పరిసమాప్తం అవుతుందన్నారు. కార్యక్రమంలో సర్వేయర్‌ కామేశ్వరరావు, వీఆర్వో బుజ్జయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T05:00:33+05:30 IST