ఇక సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు

ABN , First Publish Date - 2022-01-19T07:00:43+05:30 IST

జిల్లాలో రీసర్వే పూర్తయిన ఆరు గ్రామాల్లో ఇక భూములకు సంబంఽధించిన రిజిస్ర్టేషన్లు ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే జరుగుతాయి. వీటికి సబ్‌-డిస్ర్టిక్స్ట్‌ అని పేరు పెట్టారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ రజత్‌భార్గవ్‌ జీవో జారీ చేశారు. జీవోఎంఎస్‌ నంబర్‌ 17గా

ఇక సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు

జిల్లాలో రీసర్వే పూర్తయిన ఆరు సచివాలయాలు

సబ్‌డిస్ర్టిక్‌లుగా నామకరణం

పంచాయతీ సెక్రటరీ, వార్డు అడ్మినిస్ట్రేటర్లే రిజిస్ర్టార్లు

ప్రభుత్వం రాజపత్రం ప్రకటన

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో రీసర్వే పూర్తయిన ఆరు గ్రామాల్లో ఇక భూములకు సంబంధించిన రిజిస్ర్టేషన్లు ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే జరుగుతాయి. వీటికి సబ్‌-డిస్ర్టిక్స్ట్‌ అని పేరు పెట్టారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ రజత్‌భార్గవ్‌ జీవో జారీ చేశారు. జీవోఎంఎస్‌ నంబర్‌ 17గా ఉంది. దీని ప్రకారం ఇక గ్రామ సచివాలయాల్లో పం చాయతీ సెక్రటరీ, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో వార్డు అడ్మినిస్ర్టేటివ్‌ సెక్రటరీ సబ్‌- రిజిస్ర్టార్లుగా వ్యవహరిస్తారు. అంటే ఆయా గ్రామాల్లోని భూ క్రయ, విక్రయాలన్నీ వీరి ఆధ్వర్యంలో జరుగుతాయి. ప్రభుత్వానికి కట్టవలసిన ఛలానా సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా చెల్లించాలి. సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో జరిగినట్టే అన్ని కార్యకలాపాలు జరుగుతాయి. ప్రస్తుతం జిల్లాలోని అమలాపురం మండలంలో పాలగుమ్మి, పిఠాపురం మండలంలోని ఇల్లింద్రాడ, పెద్దాపురం మండలంలోని సిరివాడ, రాజానగరం మండలంలోని భూపాలపట్నం, రామచంద్రపురం మండలంలోని ఉట్రుమిల్లి, రంపచోడవరంలోని గోగుమిల్లి గ్రామాలను వాటి పరిధిలోని సచివాలయాలకు స్వాధీనం చేశారు.


ఇక్కడ సచివాలయాలను రిజిస్ర్టేషన్లపరంగా సబ్‌-డిస్ర్టిక్ట్‌ కార్యాలయాలుగా పిలుస్తారు. ఇల్లింద్రాడ గ్రామం మాధవపురం సబ్‌ డిస్ర్టిక్ట్‌ పరిధిలో ఉంటుంది. సిరివాడ గ్రామం గుడివాడ సబ్‌ -డిస్ర్టిక్ట్‌ పరిధిలో ఉంటుంది. ఉంట్రుమిల్లి గ్రామం తాళ్లపొలం సబ్‌-డిస్ర్టిక్ట్‌ పరిధిలో ఉంటుంది. గుడివాడ, మాధవపురం, తాళ్లపొలం ఇంతవరకూ సచివాలయాలు. ఇక  పై గ్రామాలకు చెందిన రిజిస్ర్టేషన్లన్నీ వీటిలోనే జరుగుతాయి. ఇంతవరకూ ఈ గ్రామాల రిజిస్ర్టేషన్లన్నీ  కాకినాడ రిజిస్ర్టేషన్‌ జిల్లా పరిధిలో ఉండేవి. ఇల్లింద్రాడ రిజిస్ర్టేషన్లు పిఠాపురం సబ్‌ -రిజిస్ర్టార్‌ కార్యాలయంలోనూ, ఉట్రుమిల్లి రిజిస్ర్టేషన్లు ద్రాక్షారామం సబ్‌-రిజిస్ర్టార్‌ కార్యాలయంలోనూ, సిరివాడ రిజిస్ర్టేషన్లు  పెద్దాపురం సబ్‌-రిజిస్ర్టార్‌ కార్యాలయంలోనూ జరిగేవి. ఇక ఇంతవరకూ రాజమహేంద్రవరం రిజిస్ర్టేషన్‌ జిల్లా పరిధిలో ఉన్న అమలాపురం మం డలంలోని పాలగుమ్మి ఇక పాలగుమ్మి సబ్‌-డిస్ర్టిక్ట్‌గా ఉంటుంది. ఇంతవరకూ అమలాపురం సబ్‌-రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రిజిస్ర్టేషన్లు జరిగేవి. రాజానగరం మండలంలోని భూ పాలపట్నం గ్రామం భూపాలపట్నం-2 సబ్‌-డిస్ర్టిక్ట్‌గా ఉంటుం ది. ఇంతవరకూ  రాజానగరం సబ్‌-రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రిజిస్ర్టేన్లు  జరిగేవి.  రంపచోడవరం పరిధిలోని గోగుమిల్లి గ్రా మం బందమిల్లి సబ్‌-డిస్ర్టిక్‌ పరిధిలో ఉంటుంది. ఇంతవరకూ కోరుకొండ సబ్‌-రిజిస్ర్టార్‌ కార్యాలయం పరిధిలో ఉండేవి. కానీ రిజిస్ర్టేషన్లు ఆన్‌లైన్‌ విధానం కావడం వల్ల ఎక్కడైనా చేసుకునే సౌలభ్యం కూడా ఉంది.

Updated Date - 2022-01-19T07:00:43+05:30 IST