రుషికొండ రహస్యం ఏంటి?: GVL

ABN , First Publish Date - 2022-06-03T21:41:03+05:30 IST

రుషికొండకు బయలుదేరిన బీజేపీ (BJP) నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల చర్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు.

రుషికొండ రహస్యం ఏంటి?: GVL

విశాఖ: రుషికొండకు బయలుదేరిన బీజేపీ (BJP) నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల చర్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఎంపీ జీవీఎల్ నరసింహరావు (MP GVL Narasimha Rao) మీడియాతో మాట్లాడుతూ రుషికొండకు తమను ఎందుకు వెళ్లనివ్వడంలేదు?.. అసలు రుషికొండ రహస్యం ఏంటి? అని ప్రశ్నించారు. పాత హోటల్ ఎంత పరిధిలో ఉందో ఆ మేరకే నిర్మాణం చేపట్టాలన్నారు. కోర్టులు కూడా అదే విషయాన్ని స్పష్టంగా చెప్పాయని తెలిపారు. కొండ అంతా తొలిచేసినట్టున్నారని, అందుకే వెళ్లనివ్వడం లేదని తెలిపారు. రుషికొండపై పూర్తి వివరాలు ప్రభుత్వం ఇవ్వాలని జీవీఎల్ నరసింహరావు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-06-03T21:41:03+05:30 IST