సచివాలయ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలి : కలెక్టర్‌ నాగలక్ష్మి

ABN , First Publish Date - 2022-10-05T04:56:55+05:30 IST

సచివాలయ ఉద్యోగులు నిబద్ధతతో పని చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం ఆమె మండలంలోని రుద్రంపేట సచివాలయాన్ని తనిఖీ చేశారు

సచివాలయ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలి : కలెక్టర్‌ నాగలక్ష్మి
పారిశుధ్య కార్మికులకు నూతన దుస్తులు పంపిణీ చేస్తున్న కలెక్టర్‌

అనంతపురం రూరల్‌, అక్టోబరు 4: సచివాలయ ఉద్యోగులు నిబద్ధతతో పని చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం ఆమె మండలంలోని రుద్రంపేట సచివాలయాన్ని తనిఖీ చేశారు. స్థానికంగా అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. సచివాలయం పరిధిలోని పాఠశాలను సందర్శించాలన్నారు. తద్వారా పిల్లలకు డీవార్మింగ్‌ మాత్రలు వేయించాలన్నారు. వర్షాలను దృష్టిలో పెట్టుకుని సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పంచాయతీ పరిధిలోని పారిశుధ్య కార్మికులకు సర్పంచు సుగాలి పద్మావతి ఆధ్వర్యంలో నూతన వస్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరసింహారెడ్డి, ఎంపీపీ వరలక్ష్మీ, వైస్‌ ఎంపీపీ బాలాజీ, ఎంపీటీసీ మహబూబ్‌బీ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. 


ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి 

రాప్తాడు: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు. రాప్తాడు సమీపాన గల జగనన్న కాలనీని మంగళవారం ఆమె పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్‌ లబ్ధిదారులకు సకాలంలో అందచేయాలన్నారు. డిసెంబరు 21లోగా అన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జగనన్న లేఔట్‌లో మొత్తం 536 గృహాలు మంజూరు కాగా ఇళ్ల నిర్మాణాలు వివిధద దశల్లో ఉన్నాయన్నారు. వాటిని త్వరగా పూర్తి చేయాలన్నారు. కాలనీల్లో రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించాలన్నారు.  కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన, తహసీల్దార్‌ లక్ష్మినాయక్‌, ఎంపీడీఓ సాల్మనరాజ్‌, హౌసింగ్‌ డీఈ కృష్ణారావు, ఏఈ రామ్మూర్తి పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-05T04:56:55+05:30 IST