ఎస్‌జీఎస్ కళాశాల దగ్గర 144 సెక్షన్

Published: Wed, 15 Dec 2021 21:26:48 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఎస్‌జీఎస్ కళాశాల దగ్గర 144 సెక్షన్

కృష్ణా: జిల్లాలని ఎస్‌జీఎస్ కళాశాల దగ్గర 144 సెక్షన్‌ను పోలీసులు విధించారు. విద్యార్థులు తప్ప మిగిలినవారు కాలేజీ పరిసరాల్లో సంచరించడంపై ఆంక్షలు విధించారు. శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని ఆంక్షలు విధించామని పోలీసులు చెబుతున్నారు. 


జగ్గయ్యపేట: నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఏకైక ఎయిడెడ్‌ కళాశాల ఎస్జీఎస్‌ కళాశాలను ప్రైవేటు కళాశాలగానే నడుపుతామని  ఎమ్మెల్యే, కాలేజీ చైర్మన్ సామినేని ఉదయభాను స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఎస్‌జీఎస్‌ కళాశాలను ఎయిడెడ్‌గా కొనసాగించడం కుదరదని తేల్చి చెప్పారు. ఈ విధానం నచ్చకపోతే కాలేజీ నుంచి టీసీ తీసుకుని వెళ్లిపోవచ్చని విద్యార్థులకు సూచించారు. ప్రైవేట్ కళాశాలగా ఉన్నా ప్రభుత్వ నిబంధనలు వర్తింప చేస్తామని విజయవాడ సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ తెలిపారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.