ప్రయాణికులతో కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్

ABN , First Publish Date - 2021-04-29T02:15:17+05:30 IST

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది. గత పది రోజుల్లోనే అత్యధిక సంఖ్యలో ప్రయాణికుల తాకిడి పెరిగింది.

ప్రయాణికులతో కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది. గత పది రోజుల్లోనే అత్యధిక సంఖ్యలో ప్రయాణికుల తాకిడి పెరిగింది. వేసవి కాలం వేడి నేపథ్యంలో ప్రయాణికుల కోసం రైల్వే అధికారులు టెంట్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల్లో చాలా మంది కరోనా పాజిటివ్ పేషెంట్లు ఉన్నట్లు సమాచారం. హోం ఐసోలేషన్‌కు అవకాశం లేకపోవటంతో సొంత ఇంటికి వెళ్లటానికే ప్రైవేట్ ఉద్యోగులు మొగ్గు చూపుతోన్నారు. నిన్న మొన్నటి నుంచి కలస కార్మికులు సొంత ప్రాంతాలకు తరలిపోతున్నారు.


పెద్ద సంఖ్యలో ప్రైవేటు ఉద్యోగులు, చిరు వ్యాపారులు  స్వస్థలాలకు తరలిపోతోన్నారు. రిజర్వేషన్ టికెట్స్ కోసం స్టేషన్ వద్దే రెండు రోజులుగా నిరీక్షిస్తున్నామని కొందరు ప్రయాణికులు చెబుతున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించిన విషయం తెలిసిందే. కోవిడ్ దెబ్బకు దుకాణాలు మూసుకుని చాలా మంది చిరు వ్యాపారులు వెళ్లిపోతున్నారు. కోవిడ్ తగ్గి‌న తర్వాత తిరిగి హైదరాబాద్ వస్తామని యూపీకి చెందిన ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు చెబుతున్నారు.

Updated Date - 2021-04-29T02:15:17+05:30 IST