ప్రాచీన సంస్కృతి, పరాక్రమాలకు తెలంగాణ పుణ్యస్థలం: ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2022-07-04T00:49:08+05:30 IST

ప్రాచీన సంస్కృతి, పరాక్రమాలకు తెలంగాణ పుణ్యస్థలమని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ విజయసంకల్ప సభలో ప్రసంగించిన...

ప్రాచీన సంస్కృతి, పరాక్రమాలకు తెలంగాణ పుణ్యస్థలం: ప్రధాని మోదీ

సికింద్రాబాద్: ప్రాచీన సంస్కృతి, పరాక్రమాలకు తెలంగాణ పుణ్యస్థలమని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ విజయసంకల్ప సభలో ప్రసంగించిన ఆయన తెలంగాణలో కళ, కౌశలం, పని తనం పుష్కలంగా ఉన్నాయన్నారు. యాదాద్రి, జోగులాంబ, వరంగల్ భద్రకాళి ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. కాకతీయుల వీరత్వం, శిల్పకళా సాందర్యం ఎంతో గొప్పదని, ఇక్కడి సాహిత్యకారుల కృషి దేశానికి గర్వకారణమని ప్రధాని మోదీ తెలిపారు. ‘‘దళితులు, ఆదివాసీల ఆకాంక్షలను బీజేపీ నెరవేర్చింది.  సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్ మంత్రంతో తెలంగాణ అభివృద్ధి. 8 ఏళ్లుగా ప్రజల జీవనప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నించాం. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తోంది.’’ అని ప్రధాని మోదీ తెలిపారు.



Updated Date - 2022-07-04T00:49:08+05:30 IST