Secunderabad అల్లర్ల కేసు: నోరు విప్పిన సుబ్బారావు.. సంచలన విషయాలు వెలుగులోకి..

ABN , First Publish Date - 2022-06-24T19:19:04+05:30 IST

సికింద్రాబాద్‌(Secunderabad) అల్లర్ల కేసులో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల విచారణలో నిందితుడు ఆవుల సుబ్బారావు నోరు విప్పాడు

Secunderabad అల్లర్ల కేసు: నోరు విప్పిన సుబ్బారావు.. సంచలన విషయాలు వెలుగులోకి..

Hyderabad : సికింద్రాబాద్‌(Secunderabad) అల్లర్ల కేసులో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల విచారణలో నిందితుడు ఆవుల సుబ్బారావు నోరు విప్పాడు. సుబ్బారావు తన అనుచరులతో విధ్వంస రచన చేసినట్టు పోలీసులు తేల్చారు. శివ, మల్లారెడ్డి, రెడ్డప్ప, హరి అనే అనుచరులతో.. విద్యార్థులను రెచ్చగొట్టించినట్టు తేలింది. ఆందోళనలు చేయాలని వాట్సాప్‌ గ్రూపుల్లో అనుచరులు పిలుపునిచ్చారు. గుంటూరు ర్యాలీ నుంచే ఆందోళనకు స్కెచ్‌ గీశారు. మరో అనుచరుడు నరేష్‌తో ఆందోళనకారులకు భోజనం ఏర్పాట్లు చేయించాడు. ప్రస్తుతం నరేష్ పరారీలో ఉన్నాడు. జూన్‌ 16నే సుబ్బారావు సికింద్రాబాద్‌‌కు చేరుకున్నాడు. హోటల్‌లో అనుచరులతో భేటీ అయ్యాడు. విధ్వంసానికి ప్రణాళిక రచించాడు. కాసేపట్లో సుబ్బారావును పోలీసులు రిమాండ్‌కు తరలించనున్నారు.


ఇదిలా ఉండగా.. సాయి డిఫెన్స్ అకాడమీకి ఆర్‌పీఎఫ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రైల్వే యాక్ట్ 1989 కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 24న ఆర్‌పీఎఫ్ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. సాయి డిఫెన్స్ అకాడమీ చెందిన రికార్డులు.. ఆధారాల పత్రాలతో కార్యాలయానికి హాజరుకావాలని సూచించారు.


Updated Date - 2022-06-24T19:19:04+05:30 IST