‘మైహోమ్‌’కు భద్రత అవార్డులు

ABN , First Publish Date - 2022-06-26T08:20:16+05:30 IST

మైహోమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు రెండు అంతర్జాతీయ భద్రత అవార్డులు లభించాయి.

‘మైహోమ్‌’కు భద్రత అవార్డులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మైహోమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు రెండు అంతర్జాతీయ భద్రత అవార్డులు లభించాయి. కంపెనీ అనుసరిస్తున్న భద్రత ప్రమాణాలకు గుర్తింపుగా బ్రిటిష్‌  సేఫ్టీ కౌన్సిల్‌ నుంచి ఇంటర్నేషనల్‌ సేఫ్టీ అవార్డు, యూఎ్‌సఏలో జరిగిన గ్లోబల్‌ సేఫ్టీ సదస్సులో నిర్మాణ రంగానికి సంబంధించిన అంతర్జాతీయ భద్రత అవార్డులు లభించాయని మైహో మ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. అవార్డులు రావడంపై మైహోమ్‌ గ్రూప్‌ చైర్మన్‌ జూపల్లి రామేశ్వర్‌ సంతోషం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-06-26T08:20:16+05:30 IST