Delhi borders: జంతర్ మంతర్‌లో రైతుల మహాపంచాయత్... ఢిల్లీ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం

ABN , First Publish Date - 2022-08-22T17:42:54+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో(Jantar Mantar) రైతుల(farmers)మహాపంచాయత్(mahapanchayat) నిరసన నేపథ్యంలో ...

Delhi borders: జంతర్ మంతర్‌లో రైతుల మహాపంచాయత్... ఢిల్లీ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం

 న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో(Jantar Mantar) రైతుల(farmers)మహాపంచాయత్(mahapanchayat) నిరసన నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో(Delhi borders) భద్రతను కట్టుదిట్టం చేశారు.(Security tightened)ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘూ, ఘాజీపూర్, నోయిడా, ఢిల్లీ ఛిల్లా సరిహద్దుల్లో సాయుధ పోలీసులను నియమించారు. రైతుల నిరసన కార్యక్రమం నేపథ్యంలో ఢిల్లీలో 144 సెక్షన్ ను విధించారు. సాయుధ పోలీసులు సరిహద్దుల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి రైతుల రాకను నిరోధించారు.భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినా రైతులతో కూడిన బస్సు సింఘూ సరిహద్దుల నుంచి ఢిల్లీలోకి వచ్చింది. తిక్రీ సరిహద్దుల్లో రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఘాజీపూర్ వద్ద రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతుల నిరసన కార్యక్రమాలు, పోలీసుల భారీబందోబస్తుతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 


Updated Date - 2022-08-22T17:42:54+05:30 IST