‘దిశ’తో మహిళలకు భద్రత

ABN , First Publish Date - 2022-05-19T04:46:15+05:30 IST

దిశ యాప్‌తోనే మహిళలకు భద్రతని నెల్లూరు డీఎస్పీ హరినాథ్‌ రెడ్డి అన్నారు. కొడవలూరు పంచాయతీలోని శ్రీవెంకటేశ్వర ఇంనీరింగ్‌ కళాశాలలో బుధవారం దిశ యాప్‌పై అవగాహన జరిగింది.

‘దిశ’తో  మహిళలకు భద్రత
ఇందుకూరుపేట : సెల్‌ఫోన్లలో దిశ యాప్‌ చూపుతున్న విద్యార్థులు, పోలీసులు, అధికారులు

కొడవలూరు, మే 18 :  దిశ యాప్‌తోనే మహిళలకు భద్రతని నెల్లూరు డీఎస్పీ హరినాథ్‌ రెడ్డి అన్నారు. కొడవలూరు పంచాయతీలోని శ్రీవెంకటేశ్వర ఇంనీరింగ్‌ కళాశాలలో బుధవారం దిశ యాప్‌పై  అవగాహన జరిగింది.  డీఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ వీరి చలపతిరావు,  కళాశాల సిబ్బంది , విద్యార్థులు పాల్గొన్నారు.

పొదలకూరు : స్థానిక కేసీఆర్‌ఎస్‌ కల్యాణ మండపంలో దిశ యాప్‌పై మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు.  పొదలకూరు ఇన్‌చార్జ్‌, కండలేరు డ్యాం ఎస్‌ఐ అనూష  మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్‌ వజ్రాయుధం లాంటిదన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గంగవరపు లక్ష్మీకల్యాణి, హెడ్‌కానిస్టేబుల్‌ అక్తర్‌బాషా, స్టేషన్‌ సిబ్బంది రమేష్‌, అంగన్‌వాడీ కార్యకర్తలు, పొదుపు మహిళలు, మహిళా పోలీసులు పాల్గొన్నారు. 

ఇందుకూరుపేట : కొత్తూరు జడ్పీహెచ్‌ హైస్కూల్‌లో బుధవారం ఎస్‌ఐ ఆనంద్‌ ఆధ్వర్యాన దిశ యాప్‌పై  మెగా రిజిస్ట్రేషన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిఽథిగా ఇందుకూరుపేట మండల ఉపాధ్యక్షురాలు కైలాసం లావణ్య, నాయకులు కైలాసం శ్రీనివాసులురెడ్డి, అధికారులు, పోలీసు అధికారులు, మహిళా పోలీసులు, కృష్ణచైతన్య డిగ్రీ, పీజీ కాలేజీ ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు పాల్గొన్నారు.

మనుబోలు: స్థానిక సీఆర్‌ఆర్‌ కల్యాణ మండపంలో దిశ యాప్‌ మెగా డ్రైవ్‌ నిర్వహించారు.   ఎస్‌ఐ ముత్యాలరావు, ఎంపీటీసీ సభ్యురాలు దువ్వూరు రాజేశ్వరి, ఉప సర్పంచు కడివేటి చంద్రశేఖర్‌రెడ్డి, వలంటీర్లు, మహిళాపోలీసులు, సచివాలయ ఉద్యోగులు, పొదుపు మహిళలు, వైసీపీ మండల కన్వీనర్‌ బొమ్మిరెడ్డి హరగోపాల్‌ రెడ్డి, అధికార ప్రతినిధి దాసరి మహేంద్రవర్మ, పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు. కాగా విక్రమసింహపురి యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చిన ఎంఎస్సీ విద్యార్థులు పోలీసుల సహకరాంతో 79 మంది బృందాలుగా విడిపోయి రోడ్డుపై వెళ్లే వారిని ఆపి యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించారు.

తోటపల్లిగూడూరు  : స్థానిక ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో దిశ యాప్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ప్రత్యేక డ్రైవ్‌ జరిగింది. ముఖ్య అతిఽథులుగా ఎంపీపీ ఉప్పల స్వర్ణలత, జడ్పీటీసీ శేషమ్మ, వైసీపీ కన్వీనర్‌ ఉప్పల శంకరయ్యగౌడ్‌, ఎంబేటి సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడారు. పోలీసులు ఒక్కరోజు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో రెండు వేల మందికి పైగా మహిళలు తమ మొబైల్‌ ఫోన్లలో దిశా యాప్‌ను రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం విశేషం. 

ముత్తుకూరు : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ప్రాంగణంలో పోలీసుల ఆధ్వర్యంలో దిశ యాప్‌ రిజిస్ట్రేషన్‌పై మెగా డ్రైవ్‌ నిర్వహించారు. మండలంలోని గ్రామాల్లో 3 వేల మందితో అధికారులు, స్థానిక సచివాలయ సిబ్బంది సహకారంతో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించామని పోలీసులు తెలిపారు.  కార్యక్రమంలో మండలాధ్యక్షురాలు గండవరపు సుగుణ, కృష్ణపట్నం సీఐ వేమారెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ మెట్టా విష్ణువర్థన్‌రెడ్డి, జడ్పీటీసీ బందెల వెంకటసుబ్బయ్య, సర్పంచు బూదూరు లక్ష్మి, ఉపసర్పంచు కాకుటూరు అనితారెడ్డి, ఎంపీటీసీలు వెంకటేశ్వర్లు, నవీద్‌, నాయకులు లక్ష్మణరెడ్డి, వెంకటేశ్వర్లు, ఏవో లక్ష్మణకుమార్‌, ఏపీఎం విజయలక్ష్మి  పాల్గొన్నారు.

బుచ్చిరెడ్డిపాళెం : స్థానిక పద్మావతి కల్యాణమండపంలో సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ వీరప్రతాప్‌ ఆధ్వర్యంలో   దిశ యాప్‌ రిజిస్ర్టేషన్‌  మెగా డ్రైవ్‌  జరిగింది. చైర్‌పర్సన్‌ మోర్ల సుప్రజ ముఖ్య  అతిథిగా మాట్లాడారు. బుచ్చి పోలీసులు, మహిళా పోలీసులు ఉదయం 6 నుంచి0 గంటల లోపు 2వేల మందితో దిశ యాప్‌ డౌన్‌ లోడు చేయించారు

Updated Date - 2022-05-19T04:46:15+05:30 IST