అభివృద్ధి పనులు ఆగకుండా చూడండి

ABN , First Publish Date - 2021-05-11T04:42:36+05:30 IST

నగర పంచాయతీ పరిధిలో అభి వృద్ధి పనులు ఆగకుం డా చూడాలని నగర పంచా యతీ చైర్మన్‌ మూలె హర్ష వర్దన్‌రెడ్డి అధికారులను కోరారు.

అభివృద్ధి పనులు ఆగకుండా చూడండి
మాట్లాడుతున్న చైౖర్మన్‌ మూలె హర్షవర్దన్‌రెడ్డి

ఎర్రగుంట్ల, మే 10: నగర పంచాయతీ పరిధిలో అభి వృద్ధి పనులు ఆగకుం డా చూడాలని  నగర పంచా యతీ చైర్మన్‌ మూలె హర్ష వర్దన్‌రెడ్డి అధికారులను కోరారు. స్థానిక నగరపం చాయతీ కార్యాలయంలో ఆయన కమిషనర్‌ జగన్నా థ్‌, ఏఈ హేమశేఖర్‌తో ప్రత్యే క సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పంచాయతీ కార్యాలయ నిర్మాణం పనులు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పనులు  వేగవంతం చేసేందుకు అన్ని రకాల క్లియరెన్స్‌  ఇచ్చేందుకు త్వరలో పాలకవర్గం సమావేశం నిర్వహించనున్నామన్నారు. భవన నిర్మాణాలకు బోరు కూడా వేశామన్నారు. పనులు వేగంగా చేసి అనుకున్న సమయానికి ముందుగానే పూర్తిచేయాలన్నారు. ఎర్రగుంట్లలో నేషనల్‌ హైవే పనులు వేగం పుంజుకున్నాయని రోడ్డు పనులు పూర్తి అయ్యేలోగా  సుంకలమ్మ దేవాలయం నుంచి కడప రోడ్డులోని జువారీ రైల్వేలైన్‌ బ్రిడ్జి వరకు సెంట్రల్‌ లైటింగ్‌ వేసేందుకు స్థానిక ఐసీయల్‌ యాజమాన్యం పూర్తిగా సహకరించి అభివృద్ధికి తోడ్పాటు అందిం చాలని కోరారు. ఆ మేరకు ఇండియా సిమెంట్స్‌ యాజమాన్యానికి లేఖ పంపామ న్నారు.  అర్హులందరికి వ్యాక్సిన్‌ అందేలా చూడాలని కమిషనర్‌ను కోరారు. సమావేశం లో 6వ వార్డు కౌన్సిలర్‌ నాగిరెడ్డి, కాంట్రాక్టర్‌ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. 

కో ఆప్షన్‌ సభ్యుల ఎంపిక వాయిదా

ఎర్రగుంట్ల నగరపంచాయతీలో కో ఆప్షన్‌ సభ్యుల ఎంపిక ఈనెల 19న నిర్వహించాల్సి ఉండగా కరోనా రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో వాయిదా వేసినట్లు కమిషనర్‌ జగన్నాథ్‌ తెలిపారు. 180 రోజులలోపు వారి ఎంపిక జరుగుతుందన్నారు. అందుకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం నుంచి వచ్చిందన్నారు. 

Updated Date - 2021-05-11T04:42:36+05:30 IST