ఒంటెతో కామెడీ చేయాలనుకున్నాడు.. చివరికి ఆ యువకుడికి ఎలా బుద్ధి చెప్పిందో మీరే చూడండి

ABN , First Publish Date - 2022-02-04T03:23:17+05:30 IST

ఓ ట్విట్టర్ అకౌంట్‌‌లో బాగా అలంకరించిన ఓ ఒంటెను రోడ్డు వెంట తీసుకెళ్తుంటారు. యువకులంతా దాన్ని విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఇంతలో ఓ యువకుడు ఒంటె తోకను పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఒంటెను తాకగానే..

ఒంటెతో కామెడీ చేయాలనుకున్నాడు.. చివరికి ఆ యువకుడికి ఎలా బుద్ధి చెప్పిందో మీరే చూడండి

చూస్తే కామ్‌గా ఉన్నాయనే కారణంతో కొన్ని జంతువులతో ఆటలాడితే మాత్రం చుక్కలు చూపిస్తాయి. కొన్ని సాధు జంతువులు ఒక్కోసారి ఎలా ప్రవర్తిస్తాయో వాటికే తెలీదు. అప్పటివరకూ సైలెంట్‌గా ఉన్నా.. ఒక్కోసారి ఉన్నట్టుండి బీభత్సం సృష్టిస్తుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఒంటెతో ఆటలాడాలని చూసిన వ్యక్తి.. చివరికి షాక్ తిన్నాడు.


ఓ ట్విట్టర్ అకౌంట్‌‌లో బాగా అలంకరించిన ఓ ఒంటెను రోడ్డు వెంట తీసుకెళ్తుంటారు. యువకులంతా దాన్ని విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఇంతలో ఓ యువకుడు ఒంటె తోకను పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఒంటెను తాకగానే ఒక్కసారిగా చుక్కలు చూపిస్తుంది. కాలితో ఒక్క తన్ను తన్నగానే.. ఆ యువకుడు ఎగిరి పక్కన పడతాడు. ఏంటీ తమాషా ఉందా నీకు.. అన్నట్లుగా రియాక్షన్ ఇస్తూ అక్కడి నుంచి తాపీగా వెళ్తుంది. ఇదంతా పైనుంచి ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

రేస్ బైక్‌లో రయ్‌..మంటూ వచ్చాడు.. చివరకు పరువు పోగొట్టుకున్నాడు..






Updated Date - 2022-02-04T03:23:17+05:30 IST