Viral Video: బస్సులో సీటు కోసం.. ఈవిడ ఎలాంటి ఫీట్ చేసిందో చూడండి..

ABN , First Publish Date - 2022-02-09T02:34:17+05:30 IST

సీటు కోసం ఫీట్లు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయే ఈ వీడియోలో బస్సులో సీటు కోసం ఓ మహిళ పెద్ద సాహసమే చేసింది...

Viral Video: బస్సులో సీటు కోసం.. ఈవిడ ఎలాంటి ఫీట్ చేసిందో చూడండి..

రద్దీగా ఉన్న సమయాల్లో బస్సుల్లో సీటు కోసం ప్రయాణికులు పడే పాట్లు అందరికీ తెలిసిందే. ఇక పండుగ సమయాల్లో ఇబ్బందులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో ఒక్కోసారి గొడవలు కూడా జరుగుతుంటాయి.  సీటు కోసం ఫీట్లు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయే ఈ వీడియోలో బస్సులో సీటు కోసం ఓ మహిళ పెద్ద సాహసమే చేసింది. సీటు కోసం ఆమె పడే తపన చూసి.. అంతా అవాక్కవుతున్నారు.


ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. వీడియో మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉంటుంది. లోపల ప్రయాణికులు నిండుగా ఉంటారు. ఇంతలో ఓ మహిళ అక్కడికి వస్తుంది. అయితే ముందుకు వెళ్లి డోర్ ద్వారా ఎక్కితే సీటు దొరుకుతుందో లేదో అనుకుందో ఏమో.. ఏకంగా వెనక వైపు కిటీకీ నుంచి ఎక్కేందుకు ప్రయత్నించింది. అందుకు ఆమె భర్త సహకరిస్తాడు. మొత్తానికి ఎలాగోలా బస్సులోకి ఎక్కుతుంది. ఈ వీడియో చూసిన వారంతా వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కాస్త జాగ్రత్త తల్లీ!.. అంటూ కొందరు హెచ్చరిస్తున్నారు.

తళ్లయిన పెళ్లికూతురు.. పీటలపైనే కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అసలు విషయం తెలిసింది..





Updated Date - 2022-02-09T02:34:17+05:30 IST