రైతుభరోసా కేంద్రాల్లోనే విత్తనాలు

ABN , First Publish Date - 2022-05-22T06:37:22+05:30 IST

రైతుభరోసా కేంద్రాల్లోనే అన్ని విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు జీఎస్‌ఎన్‌ లీలావతి తెలిపారు.

రైతుభరోసా కేంద్రాల్లోనే విత్తనాలు
మాట్లాడుతున్న జేడీ లీలావతి


వ్యవసాయ శాఖ జేడీ లీలావతి

తుమ్మపాల, మే 21: రైతుభరోసా కేంద్రాల్లోనే అన్ని విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు జీఎస్‌ఎన్‌ లీలావతి తెలిపారు. శనివారం జరిగిన వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆమె మాట్లాడారు. పచ్చిరొట్ట, జీలుగ, జనుము, పిల్లి పెసర విత్తనాలు ఆర్బీకేల్లో అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే కోనాం, తాండవ, పెద్దేరు రిజర్వాయర్లలో ముందుగానే నీరు వదలాలని ఇరిగేషన్‌ సలహా మండలి సమావేశంలో నిర్ణయించినట్టు చెప్పారు. జిల్లా వనరుల శాఖ డిప్యూటీ ఇంజనీర్‌ సి.చరణ్‌ మాట్లాడుతూ, అనకాపల్లి మండలంలో 6200 ఎకరాల పంట భూమి ఉందనికి జూన్‌ 15 నుంచి పంట కాలువల ద్వారా నీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి కమిటీ చైర్మన్‌ ఎం.అప్పారావు, ఏవో రామపద్మలత, పశు వైద్యాధికారి డి.రాము, ఉద్యానశాఖాధికారి టి.అనిత, జలవనరుల శాఖ ఏఈ హనుమంతరావు, ఆత్మ ఏటీఎం రామకృష్ణ పాల్గొన్నారు.


Updated Date - 2022-05-22T06:37:22+05:30 IST