డొనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన భారత సంతతి మహిళ!

ABN , First Publish Date - 2021-01-17T00:04:39+05:30 IST

కొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్న డొనాల్డ్ ట్రంప్‌కు భారత సంతతికి చెందిన మహిళ షాకిచ్చారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో గత నాలుగేళ్లుగా అమెరికాలోని కీలకమైన హెల్త్ కేర్ ఏజెన్సీ అధి

డొనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన భారత సంతతి మహిళ!

వాషింగ్టన్: కొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్న డొనాల్డ్ ట్రంప్‌కు భారత సంతతికి చెందిన మహిళ షాకిచ్చారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో గత నాలుగేళ్లుగా అమెరికాలోని కీలకమైన హెల్త్ కేర్ ఏజెన్సీ అధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారత సంతతికి చెందిన సీమా వర్మ (50) తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆమె తన రాజీనామా లేఖను గురువారం రోజు డొనాల్డ్ ట్రంప్‌కు ఇచ్చారు. మూడు పేజీల రాజీనామా లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పదవికాలం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీమా వర్మ వివరించారు. కాగా.. అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ ఏర్పాటు చేసిన ఈ టాస్క్ ఫోర్స్‌లో కూడా సీమా వర్మ కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉంటే.. నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌పై ఘన విజయం సాధించిన జో బైడెన్.. ఈనెల 20న ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయం తెలిసిందే. 


Updated Date - 2021-01-17T00:04:39+05:30 IST