కల్యాణం...కమనీయం

ABN , First Publish Date - 2021-04-22T05:58:45+05:30 IST

రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్‌ ఎంపీ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది.

కల్యాణం...కమనీయం

వాడవాడలా వైభవంగా శ్రీరామ నవమి కల్యాణోత్సవాలు

గోదావరి సిటీ, (రాజమహేంద్రవరం), ఏప్రిల్‌ 21: రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్‌ ఎంపీ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, మోనా దంపతులు భక్తి శ్రద్ధలతో కల్యాణం నిర్వహించారు.అనంతరం పార్టీనేతలు, కార్యకర్తలకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్‌రామ్‌ మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుంచి మానవాళిని కాపాడాలని ఆ శ్రీరామ చంద్రమూర్తిని ప్రార్ధించి నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైిసీపీ నగర కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ, రూరల్‌ కోఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. సీతంపేట రామాల యంవద్ద, ఏపీ అప్పారావు రోడ్డు రామాలయం సెంటర్‌లో, ఇన్నీస్‌పేట శ్రీగణేష్‌ సీతారామాలయంలో, దేవీచౌక్‌ దశావతార రామమందిరంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. జాంపేట పోలీసు క్వార్టర్స్‌ శ్రీకోదండ రామాలయంలో సీతారాముల కల్యాణం జరిగింది. ఈకార్యక్రమంలో డిఫ్యూటీ సూపరింటెండెంట్‌ వి.సత్తిరాజు, శైలజ దంపతులు స్వామి కల్యాణం నిర్వహించారు. 

రాజానగరం:  మండలంలో గ్రామాల్లో  శ్రీ సీతారాముల కల్యాణోత్సవాలను బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లోని దేవాలయాలు రామనామస్మరణతో మార్మోగాయి. మండల కేంద్రమైన రాజానగరంలోని కంచుపట్ల వారి రామాలయంవద్ద శ్రీరామనవమి కల్యాణోత్సవాల్లో భాగంగా మాజీ సర్పంచ్‌ కంచుపట్ల రామకృష్ణ, అర్చకులు శిష్ఠు పురుషోత్తం స్వామివారి కల్యాణాన్ని నయనానందకరంగా జరిపించారు. అలాగే స్థానిక రావులచెరువు గట్టున ఉన్న కోదండ రామాలయంలోనూ, అగ్రహారం రామాలయం వద్ద శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అలాగే మండలంలో తూర్పుగోనగూడెం, చక్రద్వారబంధం, రాధేయపాలెం, కానవరం, పల్లకడియం, కలవచర్ల, వెలుగుబంద, నరేంద్రపురం, నందరాడ, సీతారాంపురం గ్రామాలతో పాటు జీఎస్‌ఎల్‌ జనరల్‌ ఆస్పత్రి ప్రాంగణంలో శ్రీరామ నవమి కల్యాణ ఉత్సవాలను జరిపించారు. 

ధవళేశ్వరం: స్థానిక బ్యారేజీకాలనీ రామాలయంలో సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. పోలవరం చీఫ్‌ ఇంజనీర్‌ బి.సుధాకర్‌బాబు, విజయకుమారి దంపతులు సీతారాముల కల్యాణం, అనంతరం శ్రీరామహోమం నిర్వహించారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు. గొల్లపేట రామాలయంలో స్వామివారి కల్యాణోత్సవంలో వైసీపీ రూరల్‌ కోఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌, మాజీ కోఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజులు పాల్గొన్నారు. సాధనాల చంద్రశేఖర్‌ పర్యవేక్షణలో సీతారాముల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. రథం వీధి రామాలయం, పొత్తూరివారి వీధి రామాలయం, సాయిబాబా ఆలయం, బస్టాండ్‌సెంటర్‌ అభయాంజనేయస్వామి ఆల యం, రామపాదాలరేవువద్ద రామాలయాల్లో కల్యాణాన్ని వైభవంగా నిర్వహించి భక్తులకు పానకం పంపిణీ చేశారు. 

కడియం:  వీరవరంలో సీతాలక్ష్మణహనుమ సమేత కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. స్వామికల్యాణం అనంతరం ప్రసాదాలను, పానకాన్ని భక్తులకు అందజేశారు. సా యంత్రం స్వామి రథోత్సవం జరిగింది. ఏర్పాట్లను ఆలయ మేనేజర్‌ బీ వీ సుబ్బారావు పర్యవేక్షించారు.

మాధవరాయుడుపాలెంలో గ్రామ సర్పంచ్‌ అన్నందేవుల చంటి-విజయ దంపతులు పునర్మించిన రామాలయంలో సీతారాముల కల్యాణం బుధవారం  నిర్వహించా రు. గ్రామసర్పంచ్‌ అన్నందేవుల చంటి స్వామివారికి ప ట్టువస్త్రాలు, తలంబ్రాలు, కొబ్బరిబొండాలు అంద జేశారు.  

మండలంలో వేమగిరి, కడియం, దామిరెడ్డిపల్లి, మాధవరాయుడుపాలెం, గుబ్బలవారిపాలెం, జేగురుపాడు, దుళ్ళ, పొట్టిలంక, కడియపులంక, బుర్రిలంక, వెంకయ్యపేట, కడియపుసావరం గ్రామాల్లో రామాలయాల్లో సీతారాముల కల్యాణం నిర్వహించారు.  

రాజమహేంద్రవరంరూరల్‌ : రాజమహేంద్రవరంరూరల్‌ మండలం పరిధిలో తొర్రేడు, వెంకటనగరం, కాతేరు, కోలమూరు, కొంతమూరు, పిడింగొయ్యి, శాటిలైట్‌సిటీ, బొమ్మూరు, హుకుంపేట, రాజవోలు తదితర గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు రామాలయానికి వెళ్లి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దాతలు పానకాలు పంపిణీ చేశారు. 

దివాన్‌చెరువు: సీతారాముల కల్యాణం గ్రామగ్రామాన బుధవారం  కన్నుల పండువగా జరిగింది. దివాన్‌చెరువు లోని ఆగమాశ్రమంలో ఉన్న శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం లో కోదం డరామస్వామికి శ్రీరామనవమి కల్యాణం నిర్వహించారు. శ్రీరామపురం, శ్రీకృష్ణపట్నం, భూపాల పట్నం, పుణ్యక్షేత్రం, పాతతుంగపాడు, కొత్తతుంగపాడు, దివాన్‌ చెరు వు గ్రామాలలో రాములవారి కల్యాణం వైభవంగా జరిగింది 

కోరుకొండ: శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం కోరుకొండ మండలంలో 22 గ్రామాల్లో ఆయా రామాలయా లవద్ద సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి శ్రీ రామకోటి స్థూపంవద్ద కోదండ రామాలయంలోను, హరే రామ సమాజం నందు, నర్సాపురంలో పల్లపు వీధి రామాలయంవద్ద శ్రీశ్రీనివాస సీతారామ ఏడుకొండల దంపతులచే పురోహితులు మర్ల ప్రభాకర  సోమయాజులు, సీతారాముల కల్యాణం జరిపిం చారు. మెరకవీధి రామాలయం, పట్టాభి రామాలయం, కోదండ రామాలయాల వద్దకూడా  సీతారాముల కల్యాణో త్సవం ఘనంగా జరిగింది. కోరుకొండలో ఇరగవరపు కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో, జంబుపట్నంలో మర్ల  వెంకట గంగాధర్‌  సీతారామ శాస్త్రి ఆధ్వర్యంలోను కణుపూరు, గాదరాడ, పశ్చిమగోనగూడెం, కాపవరం, శ్రీరంగపట్నం,  పోటీ, కోటి కేశవరం, బొల్లేద్దుపాలెం,  రాఘవాపురం, మునగాల, గరగలంపాలెం, రాజవరం, బూరిగపూడి, మధురపూడి, దోసకాయలపల్లి, గాడాల, నిడిగట్ల, బుచ్చింపేట, జగన్నాధపురం గ్రామాల్లో సీతారా ముల కళ్యాణోత్సవాలు జరిగాయి. 

చింతూరు: చింతూరులో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. తిలకించడానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. 

రాజవొమ్మంగి: మండలంలోని రాజవొమ్మంగి, దూసరపాము, తంటికొండ, జడ్డంగి, లబ్బర్తి, లాగరాయి, శరభవరం తదితర గ్రామాల్లో ఆలయ కమిటీల ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. సీతారాముల కల్యాణం జరిపి భక్తులకు పానకం పంపిణీ చేశారు.

గంగవరం: మండలంలోని మొహనాపురం, మర్రిపాలెం, జడేరు, కొమరవరం, గంగవరం, ఆమదాలబంద, నెల్లిపూడి, పిడతమామిడి, మొల్లేరు, జగ్గంపాలెంల్లో సీతా రాము కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. నెల్లిపూడికి చెందిన బి.శ్రీను రామాలయానికి పంచలోహ విగ్రహాలను బహూకరించారు. 

ఎటపాక: మండలంలోని గౌరిదేవిపేటలో సీతారాముల కల్యా ణాన్ని అర్చకుడు సుబ్రహ్మణ్యాచారి శాస్త్రోక్తంగా జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి వీక్షిం చారు. అనంతరం భక్తులకు అన్నదానం జరిపారు. ఆలయ నిర్వాహకులు రవి, లోకయ్య, యశ్వంత్‌ పాల్గొన్నారు.

మోతుగూడెం: స్థానిక శ్రీసీతారామచంద్రస్వామి ఆల యంలో సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. ఏపీ జెన్‌కో డీఈ బాలకృష్ణ, ఈఈ బాబూరావు, ఆలయ కమిటీ సభ్యులు శివనారాయణ, బాలవర్ధనరావు తిలకించారు.

నిరాడంబరంగా శ్రీరామనవమి వేడుకలు...

బిక్కవోలు: బిక్కవోలులోని కొత్తపేట, మునసబుపేట, పంచాయతీ వీధి, రెడ్ల రామాలయం, ఫిషర్‌మెన్‌ కో-ఆపరేటివ్‌ సంఘ రామాలయం వద్ద సీతారాముల కల్యాణాలను అర్చకులు ఏకాంతంగా జరిపించారు. 

రంగంపేట: మండలంలోని పలు గ్రామాల్లో సీతారా ముల కల్యాణాలు నిర్వహించారు.  కోటపాడు దళితవాడ లో సమరసత సేవా ఫౌండేషన్‌ ఆద్వర్యంలో నిర్మించిన ఆలయంలో  ప్రత్యేకంగా కల్యాణం జరిపించారు.

కొవిడ్‌తో ఉష్ణగుండాలు బంద్‌

ఎటపాక, ఏప్రిల్‌ 21: రాష్ట్ర సరిహద్దులోని గుండాల గ్రామం వద్ద గల ఉష్ణగుండాలు కొవిడ్‌ నేపథ్యంలో ఇటీవల మూతపడుతూ వస్తోంది. బుధవారం శ్రీరామ నవమి సందర్బంగా ఇతర ప్రాంతాల నుంచి రామభక్తులు తరలివచ్చారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఈసారి కూడా తీయలేదు. వారంతా నిరాశతో వెనుతిరిగి వెళ్లారు. 




Updated Date - 2021-04-22T05:58:45+05:30 IST