ట్యాంక్‌బండ్ దగ్గర సీతక్క మెరుపు ధర్నా

ABN , First Publish Date - 2022-01-12T20:24:15+05:30 IST

ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎమ్మెల్యే సీతక్క మెరుపు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు సీతక్కను అరెస్ట్ చేశారు.

ట్యాంక్‌బండ్ దగ్గర సీతక్క మెరుపు ధర్నా

హైదరాబాద్: ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎమ్మెల్యే సీతక్క మెరుపు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు సీతక్కను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అసంబద్ధ బదిలీలతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని దుయ్యబట్టారు. 9 మంది టీచర్లు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 317 జీవో రద్దు చేయాలి, ఉద్యోగులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. స్థానికత ఆధారంగా బదిలీలు చేయాలన్నారు. ట్రైబల్ ఉద్యోగులను మైదానాలకు, అక్కడి ఉద్యోగులను అటవీ ప్రాంతాలకు.. బదిలీ చేయడం వల్ల మానసిక వేదనకు గురవుతున్నారని తెలిపారు. బీజేపీ డ్రామాలు ఆపి రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేపించాలని సీతక్క డిమాండ్ చేశారు.


తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 317ను తక్షణమే రద్దు చేయాలని ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. ముఖ్యంగా సీనియారిటీ జాబితాల్లో పొరపాట్లు దొర్లాయని, కౌన్సెలింగ్‌ను సరిగా చేయడం లేదని, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఉపాద్యాయులు ఆందోళన బాట పట్టారు. ఉపాధ్యాయుల కేటాయింపుల్లో సీనియారిటీ జాబితాలో జరిగిన తప్పులను సవరించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Updated Date - 2022-01-12T20:24:15+05:30 IST