
రణధీర్, నందినిరెడ్డి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఎం. వినయబాబు దర్శకత్వంలో బీసు చందర్‌గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను ఇటీవలె మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘కథ అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ప్రేమించడమే కాదు ఆ ప్రేమను సఫలం చేసుకోవాలనే విషయాన్ని ఆకట్టుకునేలా చెప్పాం’ అన్నారు. చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘కథలో మంచి మలుపులు ఉన్నాయి. దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’ అన్నారు. సుమన్ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్ నివాస్. సినిమాటోగ్రఫీ: విజయ్‌కుమార్ ఎ.