సెగలు పుట్టిస్తున్న పాయల్‌

Nov 30 2021 @ 01:19AM

చేతిలో సినిమాలు ఉన్నా లేకున్నా, సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉండడం కథానాయికలకు అలవాటుగా మారిపోయింది. ఈ విషయంలో పాయల్‌ నాలుగాకులు ఎక్కువే చదివింది. ఎప్పుడూ ఏదో ఓ ఫొటో షూట్‌తో... ఇన్‌స్ర్టాలో వేడి పుట్టిస్తుంటుంది. ఈసారి.. మరింత హాట్‌ ఫోజులతో దర్శనమిచ్చింది. పసుపు దుస్తులతో తాజాగా ఓ ఫొటో షూట్‌ చేసింది పాయల్‌. అందులో.. కాస్త శ్రుతిమించే గ్లామర్‌ ప్రదర్శనకు దిగింది. ఆ ఫొటోలన్నీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇటీవల ‘త్రీ రోజెస్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది పాయల్‌. అందులోనూ హాట్‌ సీన్లలో విజృంభించింది. తాజాగా ఓ కన్నడ సినిమా ఒప్పుకుందట. ‘హెడ్‌ బుష్‌’ అనే చిత్రంలో నటించనుందట. అందులోనూ.. తనది గ్లామర్‌ పాత్రే అని తెలిసింది. డాన్‌కి ప్రియురాలిగా తాను కనిపించబోతోందని సమాచారం. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.