మద్యం సీసాలు స్వాధీనం

ABN , First Publish Date - 2021-05-11T05:23:39+05:30 IST

జాకేరు గ్రామంలోని ఒక ఇంటిలో అక్రమంగా నిల్వ చేసిన 90 మద్యం సీసాలను, సోంపురం గ్రామంలో ఒక వ్యాపారి ఇంటిలో అక్రమంగా నిల్వ చేసిన ఖైనీ, గుట్కాలను వల్లంపూడి పోలీసులు, ఎస్‌.కోట ఎస్‌ఈబీ పోలీసులు ఆదివారం రాత్రి సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు.

మద్యం సీసాలు స్వాధీనం

 రూ.30 వేల ఖైనీ, గుట్కాల పట్టివేత 

 ఇద్దరిపై కేసు 

 వేపాడ, మే 10:  జాకేరు గ్రామంలోని ఒక ఇంటిలో అక్రమంగా నిల్వ చేసిన 90 మద్యం సీసాలను, సోంపురం గ్రామంలో ఒక వ్యాపారి ఇంటిలో అక్రమంగా నిల్వ చేసిన ఖైనీ, గుట్కాలను వల్లంపూడి పోలీసులు, ఎస్‌.కోట ఎస్‌ఈబీ పోలీసులు ఆదివారం రాత్రి సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు. ఈ దాడిలో సోంపురం గ్రామానికి చెందిన కంకటాల సత్యనారాయణ ఇంట్లో రూ.30వేల విలువగల ఖైనీలు, గుట్కాలు పట్టుకోగా, జాకేరు గ్రామానికి చెందిన ఎం.అప్పన్న దొర ఇంట్లో మద్యం అక్రమ అమ్మకాలకు నిల్వ చేసిన 90 మద్యం సీసాలను పట్టుకున్నట్టు ఎస్‌.కోట ఎస్‌ఈబీ సీఐ ఎంఆర్‌వీ అప్పారావు తెలిపారు. ఈమేరకు అప్పన్నదొరపై కేసు నమోదు చేశారు. అలాగే వల్లంపూడి పోలీసులు ఖైనీలు, గుట్కాలను స్వాధీనం చేసుకొని, సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్టు వల్లంపూడి ఎస్‌ఐ లోవరాజు తెలిపారు.

 

Updated Date - 2021-05-11T05:23:39+05:30 IST