నిందితుడు వెంకటేష్, స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లు
తిరుమలకు తరలించబోయిన భవన నిర్మాణ కూలీ అరెస్టు
తిరుమల, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): తిరుమలకు మద్యం బాటిళ్లను తరలించబోయిన ఓ భవన నిర్మాణ కూలీని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎ్సఈబీ) అధికారులు అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన వెంకటేష్ కొద్దిరోజుల నుంచి తిరుమలలో భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి ఓ స్కూల్ బ్యాగులో 20 మద్యం బాటిళ్లను పెట్టుకుని తిరుపతి నుంచి తిరుమలకు బయల్దేరాడు. అలిపిరి వద్దకు చేరుకున్న అతడు అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేశారు. అతడి వద్ద ఉన్న బ్యాగులో 20 మద్యం బాటిళ్లను గుర్తించడంతో అదుపులోకి తీసుకున్నారు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు మీడియాకు ఆదివారం ఎస్ఐలు వీరేశ్వరనాయుడు, రమణ, కానిస్టేబుళ్లు సుధాకర్, మధు తెలిపారు.