భద్రాచలంలో 40 కిలోల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2022-06-26T06:13:18+05:30 IST

భద్రాచలంలో 40 కిలోల గంజాయి పట్టివేత

భద్రాచలంలో 40 కిలోల గంజాయి పట్టివేత
పట్టుబడిన గంజాయితో పాటు నిందితుడిని చూపుతున్న ఎక్సైజు పోలీసులు

భద్రాచలం, జూన 25: భద్రాచలంలో ఎక్సైజ్‌ పోలీసు అధికారులు శనివారం రూ.10లక్షల విలువ చేసే 40 కేజీల గంజాయిని పట్టుకున్నారు. స్థానిక బస్టాండు సెంటర్లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో మహారాష్ట్ర లోని అమరావతికి చెందిన అజయ్‌ మహోడ్‌ అనే వ్యక్తి స్కూటర్‌పై వస్తుండగా తనిఖీలు నిర్వహించగా.. గంజాయి బయటపడింది. దీంతో నిందితుడిని స్టేషనకు తరలించి విచారించగా ఒడిశాలోని మల్కనగిరి నుంచి హైదరాబాద్‌ మీదుగా ఈ గంజాయిని మహారాష్ట్రకు తరలించేందుకు తీసుకెళుతున్నట్లు అంగీకరించాడని ఎక్సైజ్‌ సీఐ ఎస్‌కే. రహీమున్నీసా బేగం తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ భద్రాచలంలో గంజాయి రవాణాకు సంబంధించి నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గంజాయి సరఫరా చేసినా, రవాణా చేసినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - 2022-06-26T06:13:18+05:30 IST