గుంటూరులో నిషేధిత డ్రగ్స్ స్వాధీనం

ABN , First Publish Date - 2021-09-14T23:19:50+05:30 IST

గుంటూరు: గుంటూరు అర్బన్ పరిధిలో నిషేధిత సింథటిక్ డ్రగ్స్‌ను పెదకాకాని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు గుంటూరు

గుంటూరులో నిషేధిత డ్రగ్స్ స్వాధీనం

గుంటూరు: గుంటూరు అర్బన్ పరిధిలో నిషేధిత సింథటిక్ డ్రగ్స్‌ను పెదకాకాని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు గుంటూరు నగరంలో ఇలాంటి డ్రగ్స్ బయటపడలేదని తెలిపారు. పెదకాకాని దగ్గరలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద డ్రగ్స్ మార్పిడి చేసుకున్నట్లు తెలిసిందన్నారు. గోవా నుంచి ఈ డ్రగ్స్‌ను కొరియర్ ద్వారా తెప్పించుకున్నారని వివరించారు. రూ.లక్ష విలువ చేసే డ్రగ్స్‌ను పట్టుకున్నట్లు చెప్పారు. పట్టుబడిన నిందితులంతా ఇంజనీరింగ్ విద్యార్థులే అని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2021-09-14T23:19:50+05:30 IST