హైదరాబాద్: నిషేధిత గంజాయిని రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని కులసుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సరఫరా చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు నిఘా పెంచారు. గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 16 కిలోల గంజాయిని, 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.