గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2021-12-01T05:25:33+05:30 IST

రాజధాని అమరావతి నుంచి స్పెషల్‌ ఇంటిలిజెన్స్‌ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్‌.కోట ఎస్‌ఈబీ అధికారులు విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి కారులో వస్తున్న 120కిలోల గంజాయిని పట్టుకున్నారు.

గంజాయి స్వాధీనం

శృంగవరపుకోట రూరల్‌: రాజధాని అమరావతి నుంచి స్పెషల్‌ ఇంటిలిజెన్స్‌ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్‌.కోట ఎస్‌ఈబీ అధికారులు విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి కారులో వస్తున్న 120కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈవిషయంపై ఎస్‌ఈబీ సీఐ ధర్మారావు మంగళవారం మాట్లాడారు. తమకు అందిన సమచారం మేరకు బొడ్డవర చెక్‌పోస్టు వద్ద సోమవారం తనిఖీలు చేపట్టామన్నారు. ఈ సమయంలో ఒక కారులో ఉన్న 120 కిలోల గంజాయి గుర్తించి, స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈమేరకు ఝార్కండ్‌ రాష్ట్రం దన్‌బాద్‌ జిల్లా ఆరలగరియ గ్రామానికి చెందిన జగత్‌మోదక్‌, ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌ జిల్లా పొట్టంగి మండలం పుట్టంగికి చెందిన సుజాత తలియాలను అరెస్ట్‌ చేశామని ఆయన చెప్పారు. వీరు విశాఖ జిల్లా పెదబయలు గ్రామంలో గంజాయి కొని ఝార్కండ్‌ తరలిస్తున్నారని తెలిపారు. గంజాయి, కారు స్వాధీనం తో పాటు ఇద్దరి నిందితులను రిమాండ్‌కు పంపించామన్నారు. ఈ దాడుల్లో ఎస్‌ఈబీ హెచ్‌సీ ప్రసాద్‌, కానిస్టేబుల్స్‌ సత్తార్‌, ప్రమీల, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ అమరావతి సిబ్బంది పాల్గొన్నారు.


 గంట్యాడలో 21 కిలోలు..

గంట్యాడ: విజయనగరం నుంచి ఎస్‌.కోట వైపు వెళ్లే రహదారిలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గంట్యాడ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అరకు మండలం బాందం పంచా యతీ పరిధిలోగల రేగ గ్రామానికి చెందిన గొల్లూరి బాబీ, గొల్లూరి నరేష్‌ అనే ఇద్దరు యువకులు సుజికీ జిక్సర్‌ వాహనంపై బ్యాగులో గంజాయిని తరలిస్తుం డగా గుర్తించి, పట్టుకున్నారు. బ్యాగులో 7 ప్యాకెట్లు కలిపి 20 కిలోల 948 గ్రాము లు ఉన్నట్టు ఎస్‌ఐ కిల్లారి కిరణ్‌కుమార్‌నాయుడు చెప్పారు. ఈ గంజాయిని స్వాధీనం చేసుకొని, ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే అరకు వ్యాలీకి చెందిన కచ్చో గోపాల్‌ అనే వ్యక్తి, ఈ ఇద్దరు యువకులకు కొంత డబ్బులు ఇచ్చి గంజాయిని ఎస్‌.కోటలో అప్పగించి విజయనగరంలో అంద జేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో గోపాల్‌పై కూడా కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ చెప్పారు. 


Updated Date - 2021-12-01T05:25:33+05:30 IST