ఎర్రచందనం దుంగలు స్వాధీనం - ముగ్గురు స్మగ్లర్ల అరెస్టు

ABN , First Publish Date - 2021-12-08T05:01:03+05:30 IST

క్రమంగా తరలిస్తున్న ఆరు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు బాలపల్లె డిప్యూటీ రేంజర్‌ ఎస్‌. చంద్రకళ తెలిపారు.

ఎర్రచందనం దుంగలు స్వాధీనం - ముగ్గురు స్మగ్లర్ల అరెస్టు
బాలపల్లె రేంజిలో పట్టుకున్న దుంగలు, స్మగ్లర్లతో అటవీశాఖాధికారులు

రైల్వేకోడూరు, డిసెంబరు 7: అక్రమంగా తరలిస్తున్న ఆరు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు బాలపల్లె డిప్యూటీ రేంజర్‌ ఎస్‌. చంద్రకళ తెలిపారు. బాలపల్లె రేంజి పరిధి కనికరాళ్ల మిట్టదిబ్బ ప్రదేశంలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు, సిబ్బంది కలిసి దాడులు నిర్వహించి పట్టుకున్నామన్నారు. ఇందులో ఆరు ఎర్రచందనం దుంగలు, ఒక ద్విచక్ర వాహనం, మూడు సెల్‌ఫోన్లు, రెండు గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

రైల్వేకోడూరు మండలం లక్ష్మీపురం గిరిజనకాలనీ వాసి పెట్లూరి శివశంకర్‌, చిట్వేలి మండలం కేఎస్‌ అగ్రహారానికి చెందిన దండు హరిక్రిష్ణ, తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు టీబీపురానికి చెందిన సుబ్రమణిరాజ  స్మగ్లర్లను అరె స్టు చేసి రైల్వేకోడూరు న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఎఫ్‌బీఓలు ఎం. సుధాకర్‌, కేవీ సుబ్బయ్య, ఆర్‌. సుబ్బలక్షుమ్మ, బేస్‌ క్యాంపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T05:01:03+05:30 IST