కంటైనర్‌ను పట్టుకున్న భజరంగ్‌దళ్ సభ్యులు
షాబాద్, మే 13: కంటైనర్‌లో అక్రమంగా 15ఎద్దులు, ఒక గేదెను తరలిస్తుండగా మండలంలోని అంతారం వద్ద బజరంగ్దళ్ సభ్యులు గూడెం రమేష్ పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వీటిని శ్రీకృష్ణ గోశాలకు పంపించారు. అక్రమ రవాణా చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ అశోక్ తెలిపారు.