ఏడాదిలో అరడజను కొలువులకు ఎంపిక

ABN , First Publish Date - 2021-01-25T05:14:19+05:30 IST

ప్రస్తుత కాలంలో ప్రభుత్వ కొలువు సాధించడ మంటే ఎంతకష్టమో అందరికీ తెలి సిందే. చిన్న అటెండర్‌ ఉద్యోగం వ చ్చినా చాలు అనుకునే వాళ్లు ఎంతోమంది ఉంటారు. అయినా, గవర్న మెంట్‌ జాబ్‌ రావాలంటే పెట్టిపుట్టి ఉండాలంటారు. అయితే, ఈ యువ కుడు మాత్రం వాటికే పుట్టినట్లు ఉన్నాడు. ఒక ఉద్యోగమే గగనమైన ఈరోజుల్లో ఏకంగా ఏడాదిలో ఆరు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు.

ఏడాదిలో అరడజను కొలువులకు ఎంపిక
సింగూరు వంశీ

 

 పూజారిపేట యువకుడి సత్తా

ఆమదాలవలస: ప్రస్తుత కాలంలో ప్రభుత్వ కొలువు సాధించడ మంటే ఎంతకష్టమో అందరికీ తెలి సిందే. చిన్న అటెండర్‌ ఉద్యోగం వ చ్చినా చాలు అనుకునే వాళ్లు ఎంతోమంది ఉంటారు. అయినా, గవర్న మెంట్‌ జాబ్‌ రావాలంటే పెట్టిపుట్టి ఉండాలంటారు. అయితే, ఈ యువ కుడు మాత్రం వాటికే పుట్టినట్లు ఉన్నాడు. ఒక ఉద్యోగమే గగనమైన ఈరోజుల్లో ఏకంగా ఏడాదిలో ఆరు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఆమదాలవలస పట్టణంలోని పూజారిపేటకు చెందిన సింగూరు హరినా రాయణ, లక్ష్మిల కుమారుడు సింగూరు వంశీ సంవత్సరంలో అరడజను ఉద్యోగాలు సాధించాడు.  బీటెక్‌ చదువుకున్న వంశీ పలు పోటీ పరీక్షలు రాస్తున్నాడు. ఎల్‌ఐసీ డీవోగా మొదటగా ఎంపిక కాగా, ఇంతలో డీసీసీబీ బ్యాంకులో క్యాషియర్‌గా ఎంపికకావడంతో అందులో బాధ్యతలు చేపట్టాడు. ఇక్కడ ఉంటుండుగానే గోవా యూకో బ్యాంక్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఎంపికకావడంతో  అక్కడ చేరాడు. తాజాగా స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రకటించిన ఫలితాల్లో ఎల్‌డీసీ, ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌(ఏపీ), ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(తెలంగాణ)కు కూడా ఎంపికయ్యాడు.  

  

Updated Date - 2021-01-25T05:14:19+05:30 IST