కాగజ్‌నగర్‌లో దేహదారుఢ్య పరీక్షలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కోనప్ప
- కోనేరు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో టెస్టులు
- శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే కోనప్ప
బెజ్జూరు/పెంచికలపేట/దహెగాం/ కౌటాల/కాగజ్‌నగర్, మార్చి 27: కోనేరు చారిటబుల్ట్రస్ట్ ఆధ్వర్యంలో పెంచికల పేట, దహెగాం, కౌటాల మండలాల్లో, కాగ జ్నగర్ పట్టణంలో ఉచిత పోలీసు శిక్షణకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఆదివారం ఆయా మండ లాల పోలీస్ స్టేషన్లలో ఫిజికల్ టెస్టు నిర్వహించారు. అభ్యర్థులకు కోనేరు చారి టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేశారు. బెజ్జూరులో ఎస్సై ప్రసాద్, ఎంపీటీసీ పర్వీ న్సుల్తానా,దహెగాంలో 171మంది దరఖాస్తు చేసు కోగా 71మంది హాజరుకాగా 57మంది అర్హులుగా గుర్తించారు. ఎస్సై సనత్‌కుమార్, జడ్పీటీసీ శ్రీరామ రావు, కోనేరు చారిటబుల్ ట్రస్టుసభ్యులు పాల్గొన్నారు. కౌటాలలో ఎస్సై మనోహర్ ఆధ్వర్యంలో దేహదారుడ్య పరీక్షలు నిర్వహించారు. 157మందికి పరీక్షలు నిర్వ హించగా 111అర్హత సాధించారు. ఎంపీపీ విశ్వనాథ్, కోనేరుచారిటబుల్ ట్రస్టుసభ్యులు పాల్గొన్నారు. కాగజ్ నగర్లో ఎమ్మెల్యే కోనేరుకోనప్ప మాట్లాడుతూ ఈ ఉచితశిక్షణను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవా లన్నారు. డీఎస్పీ కరుణాకర్, సీఐ రాజేంద్రప్రసాద్, రవీందర్, ఎస్సై పాల్గొన్నారు.