ప్రకాశం జిల్లాలో సెల్ఫీ సూసైడ్

ABN , First Publish Date - 2022-04-27T18:33:53+05:30 IST

జిల్లాలోని ముండ్లమూరులో గుడిపాటి సురేంద్రబాబు అనే వ్యక్తి సెల్ఫీ సూసైడ్‌కు పాల్పడ్డాడు.

ప్రకాశం జిల్లాలో సెల్ఫీ సూసైడ్

ప్రకాశం: జిల్లాలోని ముండ్లమూరులో గుడిపాటి సురేంద్రబాబు అనే వ్యక్తి సెల్ఫీ సూసైడ్‌కు పాల్పడ్డాడు. వడ్డీకి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే తీసుకున్న వ్యక్తులు బెదిరిస్తున్నారని సురేంద్ర తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. డబ్బులు తిరిగి రావనే ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెల్ఫీ వీడియోలో తన ఆత్మహత్యకు గల కారణాలను సురేంద్ర వివరించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-04-27T18:33:53+05:30 IST