గుంటూరు జిల్లాలో సెల్ఫీ వీడియో కలకలం

ABN , First Publish Date - 2022-03-06T16:20:22+05:30 IST

మంగళగిరి మండలం నవులూరులో సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. గత నెల 26న బుల్ల సంజయ్(21) ఆత్మహత్య చేసుకున్నాడు.

గుంటూరు జిల్లాలో సెల్ఫీ వీడియో కలకలం

గుంటూరు: మంగళగిరి మండలం నవులూరులో సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. గత నెల 26న బుల్ల సంజయ్(21) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సంజయ్‌ సెల్ఫీ వీడియో తీశాడు. ఆత్మహత్యకు ఏఆర్ కానిస్టేబుల్, ఇద్దరు యువతులు కారణమంటూ వీడియో తీశారు. ఆ ముగ్గురికి ఉగ్రవాదులతో లింక్‌లు ఉన్నాయని ఆరోపించాడు. ప్రేమపేరుతో యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారని తెలిపాడు. సోషల్‌ మీడియాలో సంజయ్‌ సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. 

Updated Date - 2022-03-06T16:20:22+05:30 IST