నేటి నుంచి ఆడపడుచుల ఆత్మగౌరవ సభలు: బుడ్డా

ABN , First Publish Date - 2021-12-02T05:30:00+05:30 IST

ఆడపడుచుల ఆత్మగౌరవ సభలు శుక్రవారం నుంచి నిర్వహిస్తున్నట్టు శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు.

నేటి నుంచి ఆడపడుచుల ఆత్మగౌరవ సభలు: బుడ్డా
మహానంది ఆలయంలో పూజలు నిర్వహించి వస్తున్న బుడ్డా రాజశేఖర్‌రెడ్డి

మహానంది, డిసెంబరు 2: ఆడపడుచుల ఆత్మగౌరవ సభలు శుక్రవారం నుంచి నిర్వహిస్తున్నట్టు శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం మహానంది క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండల స్థాయి కార్యకర్తలతో మాట్లాడారు. గ్రామాల్లో వైసీపీ కార్యకర్తల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. వైసీపీ పాలన అంతమయ్యే వరకు తెలుగుదేశం పార్గీ పోరాటం చేస్తుందని చెప్పారు. ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడ్తుంటే ప్రభుత్వం వన్‌టైం సెటిల్‌మెంట్‌ పేరుతో బలవంతపు వసూళ్లు చేస్తోందని అన్నారు. అభివృద్ధి చేస్తానంటూ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సొంతంగా మ్యానిఫెస్టోను తయారు చేశారని, అందులో ఒక్కటైనా చేశారా అని ప్రశ్నించారు. నిధులు మంజూరు చేస్తే కదా గ్రామాలు అభివృద్ధి చెందేదని అన్నారు. ప్రజలు వైసీపీ పాలనకు చరమగీతం పాడి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే బుడ్డా అన్నారు. కార్యక్రమంలో మహానంది టీడీపీ మండల అధ్యక్షులు ఉల్లి మధు, మహానంది దేవస్థానం మాజీ చైర్మన్‌ పాణ్యం ప్రసాద రావు, గాజులపల్లి ఆర్‌ ఎస్‌ సర్పంచ్‌ అస్లాం బాషా, టీడీపీ కార్యకర్తలు మౌళీశ్వరరెడ్డి, విజయశేఖర్‌రెడ్డి, కంచర్ల ఈశ్వరయ్య, సీహె చ్‌ రాముడు, శ్యామల జనార్దన్‌రెడ్డి, క్రాంతి కుమార్‌ యాదవ్‌, దస్తగిరి, శివ పాల్గొన్నారు.

బండిఆత్మకూరు: ఓంకార సిద్ధేశ్వర స్వామి దర్శనార్థం ఓంకారం చేరుకున్న మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం గంగా, ఉమాసమేత ఎమ్మెల్యే సిద్ధేశ్వర స్వామి వార్లకు అభిషేకాలు చేశారు. అసలే ధరలు పెరిగి పేదలు అల్లాడిపోతోంటే రిజిస్ట్రేషన్‌ పేరిట డబ్బులు వసూలు చేయడం బాధాకరమని అన్నారు. తక్షణమే ఓటీఎస్‌ వసూళ్లు నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. 

ఆత్మకూరు: రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గ పాలనకు పతనం తప్పదని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. గురువారం వెంకటాపురంలో ఆడపడుచుల ఆత్మగౌరవం కోసం గౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క చాన్స్‌ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్‌ మడమ తిప్పి పాలన సాగించడం సిగ్గుచేటని విమర్శించారు. రెండున్న వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యంగా మారిందని దుయ్యబట్టారు. సమావేశంలో సర్పంచ్‌ మహానంది గంగాదేవి, కంచర్ల గోవిందరెడ్డి, శివప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-02T05:30:00+05:30 IST