స్టార్ ద‌ర్శ‌కుడిని విల‌న్‌గా మారుస్తున్న విజ‌య్‌

May 9 2021 @ 11:33AM

కోలీవుడ్ స్టార్ న‌టుడు, ద‌ళ‌ప‌తి విజ‌య్ 65వ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. రీసెంట్‌గా ఈ సినిమా జార్జియా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఓ స్టార్ డైరెక్ట‌ర్ విజ‌య్ 65వ చిత్రంలో విల‌న్‌గా న‌టించ‌బోతున్నారట‌. ఇంత‌కీ ఆ స్టార్ ఎవ‌రో కాదు.. సెల్వ‌రాఘ‌వ‌న్‌. ‘7/  జి బృందావ‌న్ కాల‌నీ, ఆడువారి మాట‌ల‌కు అర్థాలే వేరులే’ వంటి చిత్రాల‌తో సెల్వ రాఘ‌వ‌న్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడే. ధ‌నుశ్ సోద‌రుడైన ఈ స్టార్ డైరెక్ట‌ర్ ఇప్పుడు ధ‌నుశ్‌తో రెండు సినిమాల‌ను తెర‌కెక్కిస్తున్నాడు. అందులో ‘యుగానికొక్క‌డు 2’ కూడా ఉండటం విశేషం. కాగా దర్శకుడిగా సెల్వ రాఘవన్ బిజీగా ఉంటే  మ‌రో వైపు కీర్తిసురేశ్‌తో క‌లిసి ‘సాని కాయిదం’ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ ద‌ర్శ‌కుడిని విజ‌య్ సినిమాలో విల‌న్‌గా న‌టింప చేయ‌డాని మేక‌ర్స్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై ఓ క్లారిటీ రానుంది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.