సేమ్యా దోశ

ABN , First Publish Date - 2021-01-16T20:02:57+05:30 IST

సేమ్యా (వేగించినది) - అరకప్పు, ఉప్మా రవ్వ - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, బియ్యప్పిండి - అర కప్పు, పెరుగు - పావు కప్పు, ఉప్పు - తగినంత, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి -

సేమ్యా దోశ

కావలసినవి: సేమ్యా (వేగించినది) - అరకప్పు, ఉప్మా రవ్వ - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, బియ్యప్పిండి - అర కప్పు, పెరుగు - పావు కప్పు, ఉప్పు - తగినంత, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, కరివేపాకు - రెండు రెమ్మలు, క్యారెట్‌ - ఒకటి. 


తయారీ విధానం: ఒక పాత్రలో వేగించిన సేమ్యా తీసుకోవాలి. అందులో ఉప్మారవ్వ, బియ్యప్పిండి, పెరుగు, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్‌ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. మిశ్రమం దోశ పోసుకోవడానికి అనువుగా పలుచగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై పెనం పెట్టి కాస్త నూనె రాసి పిండిని దోశలా పోయాలి. చిన్న మంటపై రెండు వైపులా కాల్చాలి. చట్నీతో తింటే సేమ్యా దోశ రుచిగా ఉంటుంది.


Updated Date - 2021-01-16T20:02:57+05:30 IST