సేమ్యా ఇడ్లీ

ABN , First Publish Date - 2020-07-04T18:40:28+05:30 IST

సేమ్యా - రెండు కప్పులు, పెరుగు - ఒక కప్పు, పచ్చిమిర్చి - మూడు, అల్లం ముక్క - చిన్నది, కొత్తిమీర - ఒకకట్ట, క్యారెట్లు - మూడు, ఆవాలు - ఒక టీస్పూన్‌, నూనె - సరిపడా, ఉప్పు -రుచికి తగినంత, సెనగపప్పు - ఒక టేబుల్‌స్పూన్‌.

సేమ్యా ఇడ్లీ

కావలసినవి: సేమ్యా - రెండు కప్పులు, పెరుగు - ఒక కప్పు, పచ్చిమిర్చి - మూడు, అల్లం ముక్క - చిన్నది, కొత్తిమీర - ఒకకట్ట, క్యారెట్లు - మూడు, ఆవాలు - ఒక టీస్పూన్‌, నూనె - సరిపడా, ఉప్పు -రుచికి తగినంత, సెనగపప్పు - ఒక టేబుల్‌స్పూన్‌. 


తయారీ: ఒక పాత్రలో పెరుగు తీసుకొని అందులో క్యారెట్‌ తురుము, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి. తరిగిన అల్లం వేసి కలిపి పక్కన పెట్టాలి. పాన్‌ను స్టవ్‌పై పెట్టి నూనె పోసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేసి వేగించాలి. తరువాత సెనగపప్పు వేయాలి. కాసేపు వేగిన తరువాత సేమ్మా వేసి గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి. ఇప్పుడు పెరుగు మిశ్రమం వేసి బాగా కలియబెట్టి పక్కన పెట్టాలి. పావు గంట చల్లారిన తరువాత కొత్తిమీర వేసి కలపాలి. ఇడ్లీ పాత్రలకు నూనె రాసి, అందులో సేమ్యా మిశ్రమాన్ని వేయాలి. ఇడ్లీ కుక్కర్‌లో పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి. ఆవిరి తీసేసిన తరువాత సేమ్యా ఇడ్లీలను బయటకు తీయాలి. వీటిని చట్నీతో తింటో భలేగా ఉంటాయి.





Updated Date - 2020-07-04T18:40:28+05:30 IST