సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ డిపాజిట్లు 9 ఏళ్లలో 1,527% వృద్ధి

ABN , First Publish Date - 2022-08-07T07:40:26+05:30 IST

గత తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎ్‌ససీఎ్‌సఎస్‌) డిపాజిట్లు 1,527 శాతం వృద్ధి చెందాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ డిపాజిట్లు 9 ఏళ్లలో 1,527% వృద్ధి

2021-22 నాటికి రూ.32,507 కోట్లు 


న్యూఢిల్లీ: గత తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎ్‌ససీఎ్‌సఎస్‌) డిపాజిట్లు 1,527 శాతం వృద్ధి చెందాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లోక్‌సభకు వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో పోస్టాఫీస్‌ ఎస్‌సీఎ్‌సఎస్‌ స్థూల డిపాజిట్లు రూ.1,997.9 కోట్లుగా నమోదు కాగా.. 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.32,507.89 కోట్లకు చేరుకున్నాయి. సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ పథకాలు సాధారణ ఎఫ్‌డీల కంటే మెరుగైన వడ్డీ ఆదాయంతో పాటు అదనపు ప్రయోజనాలు అందిస్తుండటం ఈ డిపాజిట్ల వృద్ధికి దోహదపడింది. చిన్న మొత్తాల పొదుపు పథకాల విభాగంలోకి వచ్చే ఎస్‌సీఎ్‌సఎస్‌ వడ్డీ రేటును ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి సవరిస్తుంటుంది. అయితే, గత కొన్ని త్రైమాసికాలుగా ఆర్థిక శాఖ చిన్న మొత్తాల పొదుపు రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ వస్తోంది. 




ఎస్‌సీఎస్‌ఎస్‌ ప్రయోజనాలు

అధిక వడ్డీ రేటు: ఈ పథకం డిపాజిట్లపై చెల్లించే వార్షిక వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. ఎఫ్‌డీలు, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) పథకాలపై బ్యాంక్‌లు, పోస్టాఫీసులు ఆఫర్‌ చేస్తున్న వడ్డీ కంటే అధికమిది. ఉదాహరణకు, ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం.. రూ.10,000 డిపాజిట్‌పై మూడు నెలలకు రూ.185 వడ్డీ లభిస్తుంది. 

త్రైమాసిక చెల్లింపులు: ఈ పథకంపై వడ్డీ ఆదాయాన్ని ప్రతి మూడు నెలలకోసారి చెల్లిస్తారు. ఆటో క్రెడిట్‌ సదుపాయం ద్వారా మీ సేవింగ్స్‌ ఖాతాలోకి నేరుగా వడ్డీ జమవుతుంది. 

అధిక పెట్టుబడి పరిమితి: ఈ స్కీమ్‌లో కనీసం రూ.1,000 నుంచి గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు డిపాజిట్‌ చేసుకోవచ్చు. 

పన్ను ఆదా: సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌లో పెట్టుబడి ద్వారా ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు వడ్డీ ఆదాయంపై పన్ను రాయితీ లభిస్తుంది. రూ.50వేల పరిమితి దాటితే మొత్తం వడ్డీ ఆదాయంపై నిర్దిష్ట రేటు ప్రకారం టీడీఎస్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్‌సీఎ్‌సఎస్‌ డిపాజిట్‌దారు మొత్తం ఆదాయం ఐటీ పన్ను పరిమితికి కంటే తక్కువగా ఉంటే, వడ్డీ ఆదాయం నుంచి టీడీఎస్‌ మి నహాయించుకోకుండా ఉండేందుకు 15జీ/ 15ఎఫ్‌ ఫారమ్‌ సమర్పించాల్సి ఉంటుంది.

Updated Date - 2022-08-07T07:40:26+05:30 IST