మంత్రి అంబటి రాంబాబుపై అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు

ABN , First Publish Date - 2022-05-15T17:00:55+05:30 IST

మంత్రి అంబటి రాంబాబుపై అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు

మంత్రి అంబటి రాంబాబుపై అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు

అమరావతి: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. అంబటి రాంబాబుపై అయ్యన్నపాత్రుడు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి అంబటి రాంబాబు సంస్కార హీనుడు అంటూ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. తెల్లచొక్కా వేసి కళ్లజోడు పెట్టినంత మాత్రాన కామాంధులు సంస్కారవంతులు కాలేరని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఓ టీవీ ఛానల్ వెనక రాసలీలల గెస్ట్ హౌస్ నుంచి.. విజయవాడ హనీ గెస్ట్‌హౌస్ వరకూ అంబటి కామచరిత్ర బయటకు వస్తోందని అయ్యన్న ఆరోపించారు. ఇంకా ఉడత ఊపులు ఎందుకు కామబాబు? అంటూ అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. ఒక యాంకర్ అని నేను మెసేజ్ పెడితే అంబటి, అతని మనుషులు.. ఆరుగురికి ఫోన్లు చేసి తప్పైందని, మెసేజ్‌లు డిలీట్ చేయాలని కోరారని అయ్యన్న అన్నారు.



Updated Date - 2022-05-15T17:00:55+05:30 IST