హేమంత్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి

ABN , First Publish Date - 2020-09-26T21:25:39+05:30 IST

కులోన్మాద హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హేమంత్ హత్యకేసు రిపోర్ట్ ఏబీఎన్‌ చేతిలో వచ్చింది. హేమంత్‌ని చంపేందుకు లక్ష్మారెడ్డి

హేమంత్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి

హైదరాబాద్‌: కులోన్మాద హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హేమంత్ హత్యకేసు రిపోర్ట్ ఏబీఎన్‌ చేతిలో వచ్చింది. హేమంత్‌ని చంపేందుకు లక్ష్మారెడ్డి, యుగంధర్ పక్కా ప్లాన్ చేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. హేమంత్‌ను హత్య చేసేందుకు నెలరోజుల ముందే గచ్చిబౌలిలో యుగంధర్ సోదరులు రెక్కి నిర్వహించారు. కిరాయి హంతకులు కృష్ణ, రాజు, పాషతో యుగంధర్‌ మాట్లాడినట్లు తెలుస్తోంది. మాయమాటలు చెప్పి అవంతిని తమ వైపు తిప్పుకోవాలని లక్ష్మారెడ్డి ప్లాన్ వేశాడు. హేమంత్‌ను చంపడం కోసం లింగంపల్లిలోని లక్ష్మారెడ్డి ఇంట్లో నిందితులు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు.  అవంతి, హేమంత్‌ వివాహంతో లక్ష్మారెడ్డి, అర్చన అవమానంతో రగిలిపోయారు. తన కూతురి వివాహంపై యుగంధర్‌రెడ్డితో  అర్చన గోడు వెళ్లబోసుకున్నట్లు రిపోర్టులో పొందుపర్చారు.  హేమంత్‌ను అవంతి వివాహం చేసుకోవడంతో నాలుగు నెలల పాటు లక్ష్మారెడ్డి, అర్చన దంపతులు ఇంట్లోనే ఉన్నారు. చెల్లి బాధ చూడలేక అవంతి- హేమంత్‌ను విడదీయాలనుకుని యుగంధర్‌ అనుకున్నాడు.


ఈనెల 24న మధ్యాహ్నం 2:30కి ఇంట్లోకి 12 మంది బంధువులు బలవంతంగా చొరబడ్డారు. హేమంత్‌, అవంతిపై దాడిచేస్తూ కారులోకి బంధువులు ఎక్కించారు. లింగంపల్లిలో మాట్లాడుదామని గోపన్‌పల్లి వైపు తీసుకెళ్లారు. గోపన్‌పల్లిలో అవంతి, హేమంత్‌ తప్పించుకున్నారు. అయితే అవంతి తప్పించుకున్నా... హేమంత్‌ దొరికిపోయాడు. రాత్రి 7:30కి కారులోనే హేమంత్‌ను ఉరేసి నిందితులు చంపినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. సీన్‌లో ఎక్కడా కన్పించకుండా లక్ష్మారెడ్డి, అర్చన జాగ్రత్తపడ్డారు. హత్య చేసిన తర్వాత లక్ష్మారెడ్డి  బైక్‌పై గోపన్‌పల్లికి వచ్చాడు. హేమంత్‌ హత్య కేసులో మొత్తం 18 మంది నిందితులున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అవంతిని వదిలేయాలని హేమంత్‌ను హెచ్చరించామని యుగంధర్ చెప్పాడు. కారులో చాలా సేపు నచ్చజెప్పామని, ఎంత చెప్పినా వినకపోవడంతో హేమంత్‌ను చంపామని యుగంధర్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-09-26T21:25:39+05:30 IST