ltrScrptTheme3

బాలీవుడ్ బడా డైరెక్టర్ సినిమాకు Jr NTR ఓకే చెప్పాడా?

Oct 27 2021 @ 12:40PM

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్ఆర్ఆర్` సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీయార్ జాతీయ స్థాయిలో పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి ఏడో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తర్వాత ఎన్టీయార్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో కలిసి పనిచేయబోతున్నాడు. అలాగే `కేజీఎఫ్` డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు కూడా ఎన్టీయార్ ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. 


బాలీవుడ్ బడా డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ సినిమాలో నటించేందుకు ఎన్టీయార్ ఓకే చెప్పాడట. ఎన్టీయార్ కోసం భన్సాలీ ఓ పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌ సబ్జెక్ట్‌ను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుపై ఎన్టీయార్ కూడా ఆసక్తిగా ఉన్నాడట. `పద్మావత్`, `బాజీరావ్ మస్తానీ` వంటి భారీ సినిమాలు తీసి విజయాలు అందుకున్న సంజయ్ తమ హీరోతో సినిమా చేయబోతున్నాడనే వార్త ఎన్టీయార్ అభిమానుల్లో సంతోషం నింపుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రాబోతున్నట్టు సమాచారం. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.