ఎక్కడ చూసినా Youtube.. యూ ట్యూబ్.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా.. బాబోయ్ ఈ లేడీ గ్యాంగ్ కంట పడ్డారో..!

ABN , First Publish Date - 2021-12-27T01:18:05+05:30 IST

సోషల్ మీడియాలో ఇప్పుడో రాక్షస క్రీడ నడుస్తోంది.. విభిన్న ఆలోచనలు, వినుత్నమైన వీడియోలతో జనం ముందుకు వస్తున్న..

ఎక్కడ చూసినా Youtube.. యూ ట్యూబ్.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా.. బాబోయ్ ఈ లేడీ గ్యాంగ్ కంట పడ్డారో..!

సోషల్ మీడియాలో ఇప్పుడో రాక్షస క్రీడ నడుస్తోంది.. విభిన్న ఆలోచనలు, వినుత్నమైన వీడియోలతో జనం ముందుకు వస్తున్న సోషల్ మీడియా యూజర్స్ ఇప్పుడు ఈ రాక్షస క్రీడలో పావులాగా మారుతూరున్నారు. కొందరి సైకోయిజానికి.. పైశాచిక ఆనందానికి నిలువెల్లా దహనం అవుతున్నారు.. మరీ ముఖ్యంగా యూ ట్యూబర్స్‌పై ఈ ట్రోలింగ్ రక్కసులు దూషణ భూషణలతో విరుచుకుపడుతున్నారు.. అసలు సోషల్ మీడియా ట్రోలింగ్ రక్కసుల మోటివ్ ఏంటి..? చాప కింద నీరులా పాకుతున్న సోషల్ మీడియా సైకోయిజంపై దమ్మున్న చానెల్ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ పరిశోధనాత్మక కథనం..


యూ ట్యూబ్.. యూ ట్యూబ్!

యూ ట్యూబ్ ఇప్పుడు ఈ పేరు తెలియని వారున్నారా.. అరుగు మీద కూర్చున్న అరవయ్యేళ్ల ముసలాడు సైతం యూట్యూబ్ గురించి అనర్గలంగా చెప్పేస్తాడు.. అంతటి జన ప్రాచుర్యాన్ని పొందింది యూ ట్యూబ్.. సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్‌లో పోస్ట్ చేసే ఒక్క వీడియో సామాన్యుడిని సెలెబ్రిటీని చేస్తోంది.. అభిరుచిని బట్టి వీడియోయాలను అపోల్డ్ చేస్తుంటే ఫేమ్‌తో పాటు కొన్నాళ్ళకు అదే ఆదాయ వనరుగా మారుతోంది.. దీంతో చాలా మంది యూ ట్యూబ్, సోషల్ మీడియా వైపు మళ్లుతున్నారు.. చేతిలో మొబైల్ ఉంటే చాలు ఓ ఛానెల్ క్రియేట్ చేసి తమ టాలెంట్‌ను ప్రపంచం ముందుంచుతున్నారు. తమకంటూ గుర్తింపు పొందుతున్నారు. మంచి ఉన్న చోటే చెడు కూడా ఉంటుందన్నట్టు ఇప్పుడు యూ ట్యూబ్‌లో నీచ్ కమినే గాళ్ళు తయారు అయ్యారు.


ఏబీఎన్ ప్రతినిధి కాల్ చేయగా..!

ఇంకా ఈ గ్యాంగ్  అంతటికి మరో గాడ్ ఫాదర్ ఉన్నాడు.. అతనే ఎడిటర్ బాబు.. అలియాస్ పరిటాల శరత్ చంద్ర, అలియాస్ గురు ప్రసాద్. ఇతను ఈ గ్యాంగ్ అంతటిని నడిపిస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. పదుల సంఖ్యలో ఐడీలు క్రియేట్ చేసి ఆ ఐడీల సహాయంతో ఈ వేధింపులు ట్రోలింగ్స్‌కు పాల్పడటం గమనార్హం.. ఈ శరత్ చంద్ర అనే వ్యక్తి తానూ వైసీపీ పార్టీ  సోషల్ మీడియా వ్యవహారాలు చూస్తుంటానని, తనను ఎవరు ఏం చేయలేరని బాధితులను బెదిరిస్తున్నట్టు సమాచారం.. అయితే బాధిత యూ ట్యూబర్స్ చేస్తున్న ఆరోపణలపై ఈ కిలాడీ ట్రోలర్స్ గ్యాంగ్‌ను సంప్రదించే ప్రయత్నం ఏబీఎన్ చేసింది. ఏబీఎన్ ప్రతినిధి కాల్ చేసి వివరాలు అరా తీసే ప్రయత్నం కాల్స్ లిఫ్ట్ చేయలేదు.. సరి కదా ఏకంగా ఫోన్ స్విచాఫ్ చేసుకుంటున్నారు.


ఇకనైనా పోలీసులు రియాక్ట్ అవుతారా..!?

సోషల్ మీడియాలో ఇలాంటి సైకో గ్యాంగ్ పైశాచికం వల్ల యూ ట్యూబర్స్ తీరని శోకాన్ని ఎదుర్కుంటున్నారు. ఎవరికి చెప్పుకోలేని మానసిక వేదనను  అనుభవిస్తున్నారు. ఏదైనా ఘటన జరిగితేనే పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతారా..? పోలీసులు చర్యలు తీసుకోవాలంటే ఒకరి ప్రాణం పోవాల్సిందేనా..? ఇప్పుడు తెరమీదకు వచ్చిన ఈ ఒక్క గ్యాంగ్ మాత్రమే ఇంకా ఇలాంటి గ్యాంగ్స్ పదుల సంఖ్యలో ఉన్నాయి. ఒకరిపై చర్యలు తీసుకుంటే మరికొంత మంది భయపడే అవకాశం ఉంటుంది.. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు ఏం చేస్తారో ఏంటో మరి.


లైట్ తీస్కోవాలా.. ఏంటిది..!?

అసలు ఇంత దారుణంగా ఎదుటి వాళ్ల మనోభావాలపై చావు దెబ్బ కొడుతున్న వీరిపై పోలీసులు చర్యలు శూన్యం. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారికి   పోలీసులు ఉచిత సలహాలు ఇస్తున్నారే తప్ప వారిపై చర్యలు తీసుకోవట్లేదు. పైగా తమ పరిధి కాదు అని అటు ఇటు తిప్పి ఫిర్యాదుదారులకు ఆయాసం తెప్పిస్తున్నారు తప్ప ఈ నీచ్ కమీనే గ్యాంగ్‌ల భరతం పట్టట్లేదు. పైగా ఇదేదో చాలా చిన్న విషయం, వేధింపులు ఉన్నపుడు యూట్యూబ్ వదిలేయాలి అంతేగానీ వీటన్నింటికీ పిర్యాదు చేస్తారా..? అని తిరిగి బాధితులపై మండిపడుతున్నారు. తమ మనోభావాలు దెబ్బతింటున్నాయి.. తమ మానసిక అశాంతికి కారణం అవుతున్నారు. తల్లి, చెల్లి, ఆలీ అని చూడకుండా కామెంట్లు పెడుతున్నారు.. ఫిర్యాదు తీసుకోండి.. బాబోయ్ అంటే లైట్ తీస్కోండి.. అని పోలీసులు అనేసరికి అక్కడే బాధితుల మనోధైరం మరింత చస్తోంది.. ఇక పోలీసులు కూడా యాక్షన్ తీసుకోవడానికి వెనకాడుతూ ఉండటంతో తమకు ఈవేధింపులు తప్పవన్న బెంగతో ఆత్మహత్యలు చేసుకుని తనువూ చాలిస్తున్నారు.


అసలు ఈ కిలేడీస్ మోటివ్ ఏంటి..!?

అసలు ట్రోలింగ్ కిలాడీస్ అందరి మోటివ్ ఏంటి..? కేవలం మానసికంగా హింసించడం మాత్రమే వారి చివరి టార్గెట్ కాదు. ఈ పైశాచిక గ్యాంగ్‌లో  మరో కోణం కూడా ఉంది.. వేదింపులు ఆగాలంటే ఈ గ్యాంగ్ కొన్ని డిమాండ్స్ పెడుతుంది.. ఆ ట్రోలింగ్స్‌ను అడ్డుపెట్టుకుని ఈ గ్యాంగ్.. బ్లాక్ మెయిల్స్‌కు దిగుతోంది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే అవతలి వ్యక్తుల వ్యక్తిగత పోటోలను పోర్న్‌సైట్‌లలో అప్‌లోడ్ చేస్తామని బెదిరిస్తున్నారు. కేవలం యూ ట్యూబర్స్ వి మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యుల పోటోలను సైతం అప్‌లోడ్ చేస్తామని బెదిరింపులకు దిగుతోంది. ఈ గ్యాంగ్ అంతటిని ముందు ఉంది నడిపించేది ‘పెరుగు పెద్దమ్మ’ యూ ట్యూబ్ ఛానెల్ నిర్వాహకురాలు అని బాధితులు పోలీసులుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఒకరిద్దరు కాదు వందలాది మంది..!

కేవలం వీరిద్దరు మాత్రమే కాదు వందలాది మంది.. ఈ రాక్షస గ్యాంగ్ ట్రోలింగ్స్‌కు నలిగిపోతున్నారు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా గుట్టుగా వీడియోలు చేస్తున్నవారిని సైతం ఈ పైశాచిక గ్యాంగ్ వదలట్లేదు. నన్ను వదిలేయండి బాబోయ్ అని కాళ్ళా వేళ్ళా పడ్డా ఎదుటి వాళ్ళ కన్నీటిని చూసి వికృత వికటాట్టహాసం చేస్తోంది ఈ గ్యాంగ్.. ఉప్పల్‌కు చెందిన ఓ మహిళ తన పిల్లలకు సంబందించిన వ్యక్తిగత ఫొటోలను పోర్న్ సైట్లలో పెడతానని చెప్పడంతో ఆత్మహత్యకు సిద్ధం అయింది. మరో మహిళకు అక్రమ సంబంధాల పేరుతో వేధించారు. దీంతో ఆ టార్చర్ తట్టుకోలేని ఆమె యూ ట్యూబ్ నుంచి వైదొలగింది. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ గ్యాంగ్ వల్ల ఇంకెందరో సఫర్ అవుతున్న వారు ఉన్నారు.


తగ్గేదేల్యా..!

ఒక్కసారి ఫలానా వ్యక్తిని టార్గెట్ చేశాక ఇక ఆ గ్యాంగ్ తగ్గేదెలా అంటోంది. పోలీస్‌లు తమను ఏం చేస్తారు. వాళ్లకు భయపడాలా.. అంటూ ఈ గ్యాంగ్ ఏకంగా ఈ యూట్యూబ్ లైవ్‌లోనే చర్చించుకుంటున్నారు. ట్రోల్స్ చేస్తున్నపుడు బ్యాడ్ కామెంట్లు పెట్టేటపుడు తమకు ఫలానా లీడర్ తెలుసు. నేను ఫలానా ఎంపీ కూతురు అంటూ ఓ మైనర్ బెదిరించిన ఆడియోలు సైతం ఉన్నాయి. ఈ గ్యాంగ్ ఎంత కిలాడీ గ్యాంగ్ అంటే ఏం పోలీసుల వద్ద మాత్రమే ఉండాల్సిన సాఫ్ట్‌వేర్‌ను సైతం తమ వద్ద ఉంచుకున్నారని బాధితులు చెబుతున్నారు. ఆ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆత్మ వ్యక్తిగత వివరాలను తెలుసుకుంటూన్నారని, వాపోతున్నారు. తమకు ఈ గ్యాంగ్ చెర నుంచి విముక్తి కల్పించకపోతే చావే శరణ్యం అని అంటున్నారు బాధితులు. ఒక్కసారి గీతు అనేక యూట్యూబ్ ఛానెల్‌కు చెందిన మహిళ మాటలు వినండి..


వామ్మో ఇంత టార్చరా..!

వీరి చేతులో నిత్యం నరకం అనుభవించిన.. ఇంకా అనుభవిస్తున్న వారు కూడా ఉన్నారు. హైదరాబాద్‌లోని బాచుపల్లి చెందిన ప్రసన్న చౌదరి అనే మహిళా గత కొంతకాలంగా స్ఫూర్తిదాయకమైన వీడియోలను చేస్తూ అప్లోడ్ చేస్తోంది.. ఈ క్రమంలో అకారణంగా సదరు మహిళను ఈ సైకో గ్యాంగ్ టార్గెట్ చేసింది.. అసభ్యకర పదజాలంతో విరుచుకు పడింది. ఏంటని ప్రశ్నించిన పాపానికి మరింత దారుణంగా ఆమెను టార్చర్ చేయడం మొదలు పెట్టింది ఈ పైశాచిక గ్యాంగ్. శరీర భాగాలను వర్ణిస్తూ, రాయడానికి సాధ్యం కాని పదజాలంతో ప్రసన్న చౌదరిని వేదించసాగారు. చివరకు ఆమె ముఖాన్ని ఓ జంతువు ముఖం తగిలించి ఆ ఫొటోలను సోహల్ మీడియాలో వైరల్ చేసింది ఈ గ్యాంగ్.. దీంతో వీరి వేధింపులకు తాళలేని ప్రసన్న పోలీసులను ఆశ్రయించింది. అటు.. ఇటు.. అని ఆమెను ఖాకీలు తిప్పారే తప్ప ఆమె ఫిర్యాదుకు స్పందించిన పాపాన పోలేదు. అసలు ప్రసన్న అనే మహిళను ఎలా వేదించారో ఈ గ్యాంగ్ చుడండి..


ఈ డాక్టర్‌ ఎంత బాధపడుతున్నారో చూడండి!

కర్నూల్‌కు చెందిన మరో డాక్టర్ వీరి రాక్షస వికృత క్రీడకు నలిగిపోతున్నారు. ఫిర్యాదు చేసిన వీరిపై చర్యలు ఎందుకు తీసుకోరు..? అని  ప్రశ్నిస్తున్నారు. డాక్టర్‌‌గా పని చేస్తూ చైతన్యవంతమైన వీడియోలను చేస్తుండటంతో.. ఈ సైకో ట్రోలర్స్ గాళ్ళ కన్ను ఆమెపై పడింది. అనుకున్నదే తడువుగా తమ ట్రోలింగ్స్‌కు పని చెప్పారు. వికృత చేష్టలతో విపరీత మాటలతో ఆమెను వేధించడం మొదలు పెట్టారు. చివరకు ఈమె కూడా వేధింపులు తాళలేక  కర్నూల్ నుంచి హైదరాబాద్ వచ్చి సైబరాబాద్ పోలీసులకు పిర్యాదు చేశారు. అక్కడ ఫిర్యాదు తీసుకోకపొగా కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని పోలీసులు ఉచిత సలహా ఇవ్వడంతో అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఎవరు ట్రోలింగ్స్ పాల్పడుతున్నారు..? ఎవరి తమ మానసిక అశాంతికి కారణం అవుతున్నారని అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినప్పటికీ ఆ కంప్లైంట్‌కు మోక్షం లేదని ఆవేదన చెబుతోంది.


బాబోయ్ వారంతా అమ్మాయిలే..!

ఈ విచక్షణ రహిత ట్రోలింగ్స్ పాల్పడుతూ ఔత్సాహిక యూ ట్యూబర్స్ జీవితాలతో ఆడుకుంటోంది అబ్బాయిలు అనుకుంటే  పొరపాటే.. ఈ ట్రోలింగ్ వ్యవస్థలో కీ రోల్స్ మొత్తం అమ్మాయిలే.. వీరంతా  విద్యా జ్ఞానం లేని అవివేకులు అనుకుందామా..?  అంటే అదేం కాదు, పోనీ ఏ మాత్రం సమాజం గురించి అవగహన లేని వారా అంటే అంతకన్నా కాదండోయ్.. ట్రోలర్స్, ఈ బ్యాడ్ కామెంటేటర్లు అందరూ ఉన్నత విద్యావంతులే  కావడం గమనార్హం.  ఈ ట్రోలింగ్ వ్యవస్థలో మైనర్లు కూడా కీలకంగా ఉన్నారు. అది కూడా మైనర్ అమ్మాయిలే అధికంగా ఉన్నారు.. వీరికి చట్టాలు పట్టవు.. పోలీసులు గురించి భయం లేదు.. ఈ ట్రోలర్ బేకార్గాళ్ళకు తిన్న తిండి సంతృప్తి ఇస్తుందో.. లేదో.. తెలియదు గానీ ఎదుటి వాళ్ళ మానసిక అశాంతి మాత్రం వందకు నూట ఇరవై శాతం వీళ్లకు సంతృపి ఇస్తుందట.


ఆ కేటుగాళ్ల టీవీ చానెల్స్ ఇవే..

హైదరాబాద్‌లో ఇలాంటి సైకో గ్యాంగ్ ఒకటి ఉంది.. ఎదుటి వాళ్ళ ఏడుపుతో కడుపు నింపుకునే ఈ సైకో గ్యాంగ్ ఓ అసోసియేషన్ల లాగా  ఏర్పడింది. యూ ట్యూబర్స్‌కు చుక్కలు చూపిస్తోంది. ‘ఉట్టి టీవి’, ‘ట్రూత్ వార్’, ‘గీత వ్లాగ్స్’, ‘పెరుగు పెద్దమ్మ’, ‘ఝుమ్మంది నాదం’ ఇంకా మరికొన్ని యూ ట్యూబ్ చానెళ్లను నడుపుతున్న ఈ కిలాడీ కేటుగాళ్లు ఓ మాఫియాలాగా ఏర్పడ్డారు. పైన చెప్పుకున్న సైకో లక్షణాలు అని వీరికి ప్రస్ఫుటంగా సరిపోలుతాయి.. బ్యాడ్ కామెంట్లు, ట్రోల్స్‌లతో వీరు చేసే టార్చర్ జీవితాన్ని చాలించాలి అనిపించేలా ఉంటుంది.. వీరంతా హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో ఉంటూ నిత్యం యూట్యూబ్ లైవ్‌ల ద్వారా మాట్లాడుకుంటూ.. రేపు టార్చర్ పెట్టాలని అనుకుంటున్నా వారిని నేడు టిక్ చేసి పెడతారు.. మరో అడుగు ముందుకేసి  ఓ నలుగురు పేర్లను ఎంపిక చేసి ఇందులో ఎవర్ని టార్చర్ చేయాలో ఓటు వేయండి.. అంటూ పబ్లిక్ పోల్స్ పెడతారు.. అంతటి రాక్షస గ్యాంగ్ ఇది.. ఈ గ్యాంగ్‌లోని కిలాడీలు మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయో  ఓసారి మీరే వినండి..


ఐడీలు మార్చి మరీ..!

నగరంలో పలువురు మహిళా యూ ట్యూబర్స్ ఈ తరహా వేధింపులను ఎదుర్కొంటున్నారు.. చదవ సఖ్యం కానీ వినశక్యం పదాలతో కొంతమంది సైకో గాళ్ళు ఈ తరహా కామెంట్లతో యూ ట్యూబర్స్‌పై విరుచుకుపడుతున్నారు. ఒక ఐడీని బ్లాక్ చేస్తే.. మరో ఐడీతో కామెంట్లు చేస్తున్నారు. ఎన్ని ఐడీలు బ్లాక్ చేసినా ప్రయోజనం మాత్రం శూన్యం.. సైకోగాళ్లు ఈ  అలవాటు మానట్లేదు.. యూ ట్యూబర్స్ రోదనలు కూడా ఆగట్లేదు.. తెగించి మరీ కొందరు కామెంట్లు పెట్టిన వారికీ కౌంటర్ ఇద్దామని భావించి రిప్లై ఇస్తే ఇంకా వారి ఆగడాలు మరింత ఎక్కువ  అవుతున్నాయి.. అమ్మ, అలీ, అక్క, తమ్ముడు, చిన్న పెద్ద.. అని తేడా లేకుండా కుటుంబ సభ్యులను సైతం ప్రస్తావిస్తూ తమ బ్యాడ్ కామెంట్ల తీవ్రత పెంచుతున్నారు.. ఇక సైకోగాళ్లు పైశాచికత్వాన్ని కంట్రోల్ చేయడం తమ వల్ల కాదని భావించి చాలామంది యూ ట్యూబ్ నుంచి తప్పుకుంటున్నారు. మరికొందరు మౌనంగా రోదిస్తున్నారు. దిక్కు తోచని స్థితిలో ఆ వేధింపులు తట్టుకోలేని కొందరు ఉరి తాళ్లకు వేలాడుతున్నారు.


ఒక అసోసియేషన్‌గా ఏర్పడి..!

ఈ యూ ట్యూబ్‌లో ఒళ్ళు మండే కామెంట్లు పెట్టి ట్రోల్ చేసే వ్యక్తులు బయట వ్యక్తులేం కాదు. వాళ్ళు కూడా యూ ట్యూబర్స్. వివిధ చానెళ్లను నడుపుతున్న వారే.. వీరు ఇతరులను ట్రోల్ చేసే విధానం ముక్కు మీద వేలు వేసుకునేలా ఉంటుంది. అసలు ఈట్రోలర్స్ నెట్వర్క్  విస్మయం కలిగించేలా ఉంటోంది.. ఈ సైకో బ్యాచ్ అంతా కలిసి ఒక అసోసియేషన్ ఏర్పడింది అంటే మీరు నమ్మగలరా..  అవును ఇది అక్షర సత్యం. వివిధ చానెళ్లకు నడుపుతున్న ఓ ట్రోలర్స్ ఓ అసోసియేషన్‌గా మారి ఎవరిని టార్గెట్ చేయాలి..? ఎలా వేధింపులకు గురి చేయాలి..? ఎవరి తాట తీయాలో..?  అనేది ముందస్తుగా ప్లాన్ జేసుకుంటాయి అంటే ఈ సైకోగాళ్లు పైశాచికత్వం ఏ స్థాయికి చేరుకుందో అర్థం అవుతుంది.. ఈ పైశాచిక మనస్తత్వం కలిగిన ఈ  రాక్షస ట్రోలర్స్ ఎవరిని టార్గెట్ చేయాలి..? అని డిసైడ్ చేసుకోవడానికి నిత్యం మీటింగ్‌లు పెట్టుకుంటారు. ఇదొక్కటి చాలదా ఈ రాక్షస మనస్తత్వం గురించి  అర్థం చేసుకోవడానికి.!


కొందరు సైకోగాళ్లుగా మారి..

కొంతమందికి ఏదో చేయాలన్న తపన. తన ఆలోచనలు ఎందరికో చేరాలన్న కాంక్ష.. ఇందుకోసం సామజిక మాధ్యమాలే అందుకు అనువైన మార్గాలు అని నమ్మి తమ ఉద్యోగాలను సైతం తృణప్రాయాంగా త్యజించి యూట్యూబ్‌లోకి అడుగు పెడుతున్నారు.. ఆలా సక్సెస్ అయిన వాళ్ళు వేలల్లో ఉన్నారు. ఛానెల్ ప్రారంభించి తమ అభిరుచులను నలుగురితో పంచుకుంటూ ఉన్న సమయంలో.. అంత బాగుందిలే అనుకుంటున్న తరుణంలో ట్రోలర్స్ రూపంలో, బ్యాడ్ కామెంట్స్ రూపంలో.. యూ ట్యూబుర్ల మెడకు కొందరు సైకోగాళ్లు ఉచ్చు బిగుస్తున్నారు. అయితే కొందరు ఈ కామెంట్లను లైట్ తీసుకుంటే.. మరికొందరి జీవితాన్ని తుంచేస్తున్నాయ్ ఈ బ్యాడ్ కామెంట్లు.


చిన్నదే కావచ్చు కానీ..!

చూడ్డానికి వినడానికి  ఈ బ్యాడ్ కామెంట్లు అనే మాట చాల చిన్నదే కావచ్చు.. కానీ దాని పర్యవసానాలు లోతుగా వెళ్తే తప్ప మనకు కళ్ళకు కట్టట్లేదు. ఈ వికృత క్రీడతో వేధింపబడుతున్న కొందరు యూ ట్యూబర్స్ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ని ఆశ్రయించారు.. గొంతు పెగలని వారి బాధను అర్థం చేసుకున్న ఏబీఎన్.. ఈ యూట్యూబ్ సైకోయిజం అంతు తేల్చడానికి సిద్ధమైంది.. ఏబీఎన్ ప్రత్యేక పరిశోధనలో అసలు యూట్యూబ్‌లో ఈ వికృత క్రీడ వేళ్లూనుకున్న విధానం చూసి నివ్వెరపోయింది.. యూట్యూబ్ బ్యాడ్ కామెంట్ల విషక్రీడలో ఉంది ఒక వ్యక్తి కాదు.. ఒక సమూహం అని తేలింది. పైశాచిక, రాక్షస మనస్తత్వం కలిగిన కొందరు యూటుబర్స్ ఈ వికృత క్రీడకు తెర తీసినట్టు తెలిసింది.

Updated Date - 2021-12-27T01:18:05+05:30 IST