ఎన్టీఆర్ - కొరటాల 'సెన్సేషనల్'..?

Jun 6 2021 @ 12:29PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. దీనికి  'సెన్సేషనల్' అనే పవర్‌ఫుల్ టైటిల్ పరిశీలిస్తున్నట్టు, తాజాగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంకతముందు వీరిద్దరి కాంబినేషన్‌లో 'జనతా గ్యారేజ్' వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. దాంతో మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే అంచనాలు బాగానే మొదలయ్యాయి. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నారు. స్టూడెంట్ పాలిటిక్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించనున్నారనే ప్రచారం జరుగుతోంది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.ఆర్.ఆర్' చేస్తున్న ఎన్టీఆర్, తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకురానున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందనుంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.