ఐదేళ్లలో సెన్సెక్స్‌ @ లక్ష

ABN , First Publish Date - 2021-07-30T05:51:10+05:30 IST

కంపెనీల పనితీరు ఆశావహంగా ఉంది. కొవిడ్‌ మహమ్మారి కారణంగా కొన్ని

ఐదేళ్లలో సెన్సెక్స్‌ @ లక్ష

  • మహీంద్రా మనులైఫ్‌ ఎండీ బిష్ణోయ్‌ 

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కంపెనీల పనితీరు ఆశావహంగా ఉంది. కొవిడ్‌ మహమ్మారి కారణంగా కొన్ని కంపెనీల ఆదాయాలపై ప్రభావం ఉన్నప్పటికీ.. దాదాపు అన్ని కంపెనీలు ఆకర్షణీయమైన లాభాలను ప్రకటిస్తున్నాయి. కనీసం రెండు, మూడేళ్లు వేచి ఉండే వారికి పెద్ద, మధ్య స్థాయి కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయని మహీంద్రా మనులైఫ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఎండీ, సీఈఓ అశుతోశ్‌ బిష్ణోయ్‌ తెలిపారు. కొవిడ్‌  కష్టాల నుంచి బయటపడుతూ.. కంపెనీలు బలోపేతం అవుతున్నాయన్నారు. మహీం ద్రా మనులైఫ్‌ కొత్త ఫండ్‌ ‘ఫ్లెక్సీ క్యాప్‌’ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.


భవిష్యత్తులో చైనా నుంచి నిధులు భారత మార్కెట్లోకి తరలి వచ్చే వీలుందన్నారు. 1994లో నిఫ్టీ ప్రారంభించిన నాటి నుంచి సగటున ఏడాదికి 13.5 శాతం ప్రతిఫలం ఇచ్చింది. 1979లో 100 పాయింట్లతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఇప్పుడు 50,000 పాయింట్లు దాటింది.  ఒడిదొడుకులు ఎదురైనా దీర్ఘకాలంలో స్టాక్‌ మార్కె ట్‌ ఆకర్షణీయ ఫలితాలను ఇవ్వగలదన్నారు. భారత్‌ ‘యువ’ దేశం. అధిక శాతం మంది ఆదాయాన్ని ఆర్జిస్తునే ఉంటారు. పని చేస్తూనే ఉంటారు. ఆర్థిక వృద్ధి కొనసాగుతునే ఉంటుంది. దీంతో వచ్చే ఐదేళ్లలోపే సెన్సెక్స్‌ లక్ష పాయింట్లను  చేరగలదని  అన్నారు. 


ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌ : కాగా కొత్తగా ప్రారంభించిన ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌ ఈ నెల 30 నుంచి వచ్చే నెల 25 వరకు అందుబాటులో ఉండనుంది. దీని ద్వారా సమీకరించిన నిధుల్లో 65 శాతాన్ని ఈక్విటీ, ఈక్విటీ సంబంధ సాధనాల్లో,  35 శాతాన్ని మనీ మార్కెట్‌ సెక్యూరిటీలు వంటి వాటిలో మదుపు చేస్తారు. 


Updated Date - 2021-07-30T05:51:10+05:30 IST