సెన్సెక్స్ వరుసగా మూడో రోజూ పతనం...

ABN , First Publish Date - 2022-05-25T22:10:14+05:30 IST

సెన్సెక్స్ వరుసగా మూడవ రోజూ పతనమైంది. బుధవారం 303 పాయింట్లు పడిపోయింది, నిఫ్టీ 16,050 దిగువన స్థిరపడింది.

సెన్సెక్స్  వరుసగా మూడో రోజూ పతనం...

ముంబై : సెన్సెక్స్ వరుసగా మూడవ రోజూ పతనమైంది. బుధవారం 303 పాయింట్లు పడిపోయింది, నిఫ్టీ 16,050 దిగువన స్థిరపడింది. గ్లోబల్ సూచీలు స్వల్పంగా ఉన్నందున సెన్సెక్స్, నిఫ్టీ బెంచ్‌మార్క్ సూచీలు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. S&P BSE సెన్సెక్స్ ఉదయాన్నే లాభాలను కోల్పోయి 303.35 పాయింట్లు, లేదా... 0.56 శాతం దిగువన 53,749.26 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 99.40 పాయింట్లు, లేదా... 0.62 శాతం క్షీణించి, 16,025.80 వద్ద ముగిసింది. ఐటీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకులు, లోహాలు, వినియోగ సంబంధిత స్టాక్‌లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా బెంచ్‌మార్క్‌లు డ్రాప్ అయ్యాయి.


ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, దివీస్ ల్యాబ్స్, యూపీఎల్, టెక్ ఎం, విప్రో, టీసీఎస్, అపోలో హాస్పిటల్స్, జేఎస్‌డబ్ల్యూఎస్ స్టీల్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం 2-8 శాతం మధ్య పతనం కావడం ఇందుకు ఉదాహరణ. ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్, కోటక్ బ్యాంక్, ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ షేర్లు 1-4 శాతం వరకు పెరగడంతో కొంత మద్దతునిచ్చాయి. అదే సమయంలో, బీఎస్‌ఈ  స్మాల్‌క్యాప్ ఇండెక్స్ దాదాపు 3 శాతం స్లైడింగ్, మరియు బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2 శాతానికి దగ్గరగా పడిపోవడంతో మార్కెట్లు పతనమయ్యాయి. మొత్తంమీద సెన్సెక్స్ 38 పాయింట్లు దిగువకు ముగియగా, నిఫ్టీ 16,200 వద్ద ముగిసింది; టాటా స్టీల్ 12 % క్రాష్ కాగా,  మారుతి 4 % పెరిగింది. ఇక... పెట్టుబడిదారులు బుధవారం రూ. 6.36 లక్షల కోట్లు నష్టపోయారు. రంగాలవారీగా చూసుకుంటే... నిఫ్టీ IT ఇండెక్స్ 3 శాతం,  వ్యక్తిగత స్టాక్‌లు 7 శాతం వరకు పతనమయ్యాయి. 

Updated Date - 2022-05-25T22:10:14+05:30 IST