లాభాల్లో Stock Exchange.. జోష్‌లో బ్యాంకులు, ఆటో ఫైనాన్షియల్ షేర్లు

ABN , First Publish Date - 2022-07-22T16:45:50+05:30 IST

గ్లోబల్ క్యూస్(Global Cues) సపోర్ట్ ఏమాత్రం లేకున్నా.. శుక్రవారం ఉదయం బెంచ్‌మార్క్ సూచీలు(Benchmark Indices)

లాభాల్లో Stock Exchange.. జోష్‌లో బ్యాంకులు, ఆటో ఫైనాన్షియల్ షేర్లు

Stock Exchange : గ్లోబల్ క్యూస్(Global Cues) సపోర్ట్ ఏమాత్రం లేకున్నా.. శుక్రవారం ఉదయం బెంచ్‌మార్క్ సూచీలు(Benchmark Indices) మాంచి జోష్‌తో ప్రారంభమయ్యాయి. యూఎస్ ఫ్యూచర్స్(US Futures) తక్కువగా ట్రేడ్ అవుతుండగా.. ఆసియా(Asia) మార్కెట్లు మాత్రం మిశ్రమ ధోరణిని కనబరిచాయి. భారతీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా గ్లోబల్‌ మార్కెట్ల సానుకూల సంకేతాలతో సెన్సెక్స్‌ శుక్రవారం 200 పాయింట్లు ఎగిసింది. సెన్సెక్స్ 233 పాయింట్లు ఎగిసి 55,915 నిఫ్టీ 72 పాయింట్లు లాభంతో 16,678  మొదలైంది. 


ప్రస్తుతం సెన్సెక్స్‌(Sensex) 95 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 33 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. ఉదయం 9.19 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 230.73 పాయింట్లు లేదా 0.41 శాతం పెరిగి 55,912.68 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడే ట్రేడ్‌లో ఇండెక్స్ సైకలాజికల్ మార్క్ 56,000కు చేరింది. నిఫ్టీ50 71.05 పాయింట్లు లేదా 0.43 శాతం పెరిగి 16,676.30 వద్ద ట్రేడవుతోంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.20 శాతం వరకు పెరిగాయి.


కోలుకున్న రూపాయి..


ఇక నేడు బ్యాంక్, ఆటో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభాల బాటలో పయనిస్తున్నాయి. యూపీఎల్‌(UPL), అదానీ పోర్ట్స్(Adani Ports), ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank), కోటక్ బ్యాంక్(Kotak Bank), నెస్లే ఇండియా(Nestle India), రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries), అల్ట్రాటెక్ సిమెంట్(Ultratech Cement), టైటాన్(Titan), ఎస్‌బీఐ(SBI), బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్  హిందుస్థాన్ యూనిలీవర్ టాప్ గెయినర్‌లలో ఉన్నాయి. ఎల్‌ఐసీతో పాటు ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌టెక్‌, విప్రో, అపోలో హాస్పిటల్స్‌ లాభాల బాటలోనే పయనిస్తోంది. మరోవైపు డాలరు మారకంలో రూపాయి కనిష్ట స్థాయి నుంచి కోలుకుంది. 6 పైసల లాభంతో 79.90 వద్ద కొనసాగుతోంది. 



 


Updated Date - 2022-07-22T16:45:50+05:30 IST