ఫుల్ జోష్‌లో Stock markets.. గ్లోబల్ మార్కెట్ల దన్నుతో భారీ లాభాల్లో పరుగులు

ABN , First Publish Date - 2022-05-30T19:05:46+05:30 IST

దేశీయ ఈక్విటీ మార్కెట్లు(Equity markets) భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల దన్నుతో సోమవారం మధ్యాహ్నం 1:20 గంటల సమయంలో బీ

ఫుల్ జోష్‌లో Stock markets.. గ్లోబల్ మార్కెట్ల దన్నుతో భారీ లాభాల్లో పరుగులు

ముంబై : దేశీయ ఈక్విటీ మార్కెట్లు(Equity markets) భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల దన్నుతో సోమవారం మధ్యాహ్నం 1:20 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్(Bse Sensex) 1068 పాయింట్లు లేదా 1.95 శాతం వృద్ధి చెంది 55,947 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ(NSE Nifty) 305 పాయింట్లు లేదా 1.87 శాతం లాభంతో 16,659 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. యూఎస్ వాల్‌స్ట్రీట్ లాభాల్లో ముగియడం గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్‌కు కారణమైంది. ఈ ప్రభావంతో భారత్ సహా ఇతర ఆసియా మార్కెట్లన్నీ చక్కటి లాభాలతో పరుగులు పెడుతున్నాయి.


ప్రధాన సూచీలతోపాటు మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు కూడా గణనీయమైన లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ  మిడ్‌క్యాప్ 2.07 శాతం, స్మాల్ క్యాప్ 2.43 శాతం చొప్పున లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈపై రంగాలన్నీ గ్రీన్‌ గానే కొనసాగుతున్నాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ 3.83 శాతం నుంచి 3.14 శాతం మధ్య లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ప్రత్యేకంగా స్టాకుల విషయానికి వస్తే.. అత్యధికంగా ఇన్ఫోసిస్ 4.22 శాతం లాభపడగా ఆ తర్వాత ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ షేర్లు కూడా చక్కటి లాభాల్లో కొనసాగుతున్నాయి. మొత్తంగా బీఎస్‌ఈపై 2,362  షేర్లు గ్రీన్‌గా... 902 స్టాకులు రెడ్‌గా కొనసాగుతున్నాయి. 

Updated Date - 2022-05-30T19:05:46+05:30 IST