Stock markets : లాభాల్లోంచి నష్టాల్లోకి సూచీలు.. Sensex 100 పాయింట్లు పతనం..

ABN , First Publish Date - 2022-07-05T21:42:28+05:30 IST

ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి.. పాజిటివ్ ట్రెండ్‌ నెగిటివ్ అయ్యింది.. మొత్తంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు(Equity

Stock markets : లాభాల్లోంచి నష్టాల్లోకి సూచీలు.. Sensex 100 పాయింట్లు పతనం..

ముంబై: పాజిటివ్ ట్రెండ్‌ నెగిటివ్ అయ్యింది.. ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి.. మొత్తంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు(Equity Markets) మంగళవారం సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. అనిశ్చితి బీఎస్ఈ సెన్సెక్స్(Sensex) స్వల్పంగా 100 పాయింట్లు లేదా 0.19 శాతం మేర క్షీణించి(falls) 53,134 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ(Nifty) 25 పాయింట్లు లేదా 0.15 శాతం నష్టపోయి 15,811 పాయింట్ల వద్ద సూచీ స్థిరపడింది. సెన్సెక్స్ సూచీ ఇంట్రాడే(Intraday)లో 812 పాయింట్ల మేర ఊగిసలాడింది. ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు లాభాలతో ఆరంభమైనా.. ఆ పాజిటివ్ ట్రెండ్‌ని కొనసాగించలేకపోయాయి. టెక్నాలజీ(Tech), బ్యాంకింగ్(Banking), ఆటోమొబైల్(Auto Mobile), కన్స్యూమర్(Consumer) రంగాల స్టాకుల్లో కొద్దిపాటి అమ్మకాల ఒత్తిడి సూచీల నష్టానికి కారణమయింది. చైనా ఎగుమతులపై టారిఫ్‌లను అమెరికా కొద్దిమేర సడలించవచ్చంటూ రిపోర్టులు వెలువడడం ఆసియా మార్కెట్లకు సానుకూలమైంది.


మిడ్(Mid), స్మాల్ క్యాప్(Small cap) షేర్లు కూడా బలహీనంగానే ముగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్(NIfty Midcap) 100 0.27 శాతం, స్మాల్ క్యాప్(Small cap) 0.07 శాతం మేర స్వల్ప నష్టాలను చవిచూశాయి. ఎన్ఎస్‌ఈపై 15 ఉప సూచీల్లో 11 నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ ఐటీ సూచీ 0.70 శాతం, నిఫ్టీ బ్యాంకు సూచీ 0.37 శాతం, నిఫ్టీ ఆటో సూచీ 0.36 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ సూచీ 0.16 శాతం, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీ 0.13 శాతం చొప్పున కొద్దిపాటి నష్టాల్లో ముగిశాయి.

Updated Date - 2022-07-05T21:42:28+05:30 IST