ఇన్‌స్టాగ్రామ్‌లో సెన్సిటివ్‌ కంటెంట్‌ కంట్రోలర్‌

ABN , First Publish Date - 2021-07-24T05:46:52+05:30 IST

హింస, దౌర్జన్యం, మితిమీరిన శృంగారంతో వచ్చే కంటెంట్‌ను నియంత్రించుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ ప్రత్యేకించి ఒక ఫీచర్‌ను విడుదల చేసింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో సెన్సిటివ్‌ కంటెంట్‌ కంట్రోలర్‌

హింస, దౌర్జన్యం, మితిమీరిన శృంగారంతో వచ్చే కంటెంట్‌ను నియంత్రించుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ ప్రత్యేకించి ఒక ఫీచర్‌ను విడుదల చేసింది.  కంపెనీ నిబంధనలను అతిక్రమించిన కంటెంట్‌ యూజర్లను ఇబ్బంది పెట్టవచ్చు. ఇలాంటి వాటిని ‘సెన్సిటివ్‌ కంటెంట్‌ కంట్రోల్‌’ నియంత్రిస్తుంది.


అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఎక్స్‌ప్లోర్‌ టాబ్‌’ ఉంటుంది. దీంట్లో తాము ఫాలో కాని వ్యక్తుల పోస్టులను కూడా చూడవచ్చు. అయితే పబ్లిక్‌గా ఉన్న అకౌంట్స్‌ మాత్రమే కనిపిస్తాయి. అయితే, సెన్సెటివ్‌ కంటెంట్‌కు సంబంధించి మూడు పరిమితులు ఉన్నాయి. మొదటిది దౌర్జన్యం అంటే వ్యక్తులు కొట్లాడుకోవడం వంటివి. రెండోది శృంగారం. మూడోది పొగాకు, డ్రగ్స్‌ వంటి నియంత్రిత ఉత్పత్తులు. ఈ పరిధిలో  సెన్సిటివ్‌ కంటెంట్‌ కంట్రోల్‌ ఉపయోగించి అదుపులో ఉంచవచ్చు. ఇందులో మూడు ఆప్షన్స్‌ ఉన్నాయి. అలౌ, లిమిట్‌, లిమిట్‌ ఈవెన్‌ మోర్‌ పేరిట ఉన్నాయి. సాధారణంగా లిమిట్‌తో సెట్‌ అయి ఉంటుంది. అవసరమైన విధంగా వినియోగదారులు సెట్‌ చేసుకోవచ్చు. దీని కోసం సెట్టింగ్స్‌ టాప్‌ చేసి - అకౌంట్‌ - సెన్సెటివ్‌ కంట్రోల్‌కు వెళ్ళవచ్చు.

Updated Date - 2021-07-24T05:46:52+05:30 IST