ఐదుగురికి తీవ్ర గాయాలు

Published: Mon, 28 Mar 2022 00:23:39 ISTfb-iconwhatsapp-icontwitter-icon

శృంగవరపుకోట రూరల్‌ (జామి): జామి-దొండపర్తి రహదారిలో ఆదివారం రోడ్డు పక్కన ఆగివున్న ఆటోను విజయనగరం నుంచి వస్తున్న మరో ఆటో వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగు రు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.  దీనిపై ఎస్‌ఐ వీరబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక జేఎస్‌ఆర్‌ కల్యాణ మండపం వద్ద ఒక ఫంక్షన్‌ జరుగుతున్న సందర్భంగా దీనికి ఆటోలో కొంతమంది వచ్చి ఫంక్షన్‌కు హాజరుకావడంతో వీరిని తీసుకొచ్చిన ఆటోను డ్రైవర్‌ రోడ్డుపక్కన నిలిపి ఉంచాడన్నారు. ఇదే సమయంలో ప్రయాణి కులతో విజయ నగరం నుంచి జామి వస్తున్న మరో ఆటో అతివేగంతో వచ్చి ఢీకొట్టిందన్నారు. ఈ ప్రమాదంలో ఆగివున్న ఆటోలో కూర్చొని సేదతీరుతున్న వడలీ సత్యనారాయణతో పాటు ఆటోలో వున్న ప్రయాణికులు ఎడ్ల శ్రీను, సూరెడ్డి ఈశ్వరరావు, సూరెడ్డి గౌరీశంకర్‌, చింతా అప్పారావులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వీరిని 108 వాహనంలో విజయనగరం మహారాజకు తరలించారు. ఆటో డ్రైవర్‌ అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ఆటోను నడుపుతున్న వ్యక్తి జామి కి చెందిన రొట్ట చందుగా గుర్తించి, కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.