రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2022-07-01T05:50:03+05:30 IST

మండలంలోని చింతాడ గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

శృంగవరపుకోట రూరల్‌ (జామి): మండలంలోని చింతాడ గ్రామం వద్ద  గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రామభద్రపురం ఆగ్రహారానికి చెందిన గనివాడ స్వామినాయుడు బైకుపై జామి వెళ్తుండగా, చింతాడ వద్ద ఎదురుగా ఇటుకల లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన స్వామినాయుడును కొంతమంది యువకులు పరిశీలించారు. 108కి సమాచారం ఇచ్చి, విజయనగరం మహారాజ ఆసుపత్రికి తరలించారు. స్వామినాయుడుకు భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. స్వామినాయుడు గ్రామంలో వ్యయసాయ కూలీగా పనిచేస్తున్నాడు. 

Updated Date - 2022-07-01T05:50:03+05:30 IST